దేవి నాగవల్లిపై కరాటే కల్యాణి బిగ్‌బాంబ్ ప్రతీకారం.. చేయని తప్పుకు కష్టాల్లో పడ్డ న్యూస్ రీడర్

బిగ్‌బాస్ తెలుగు 4 షో రెండోవారం ట్విస్టులతో ముగిసిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రెండో కంటెస్టెంట్‌గా కరాటే కల్యాణి వేదికపై నాగ్‌తో కలిసి సందడి చేసింది. ఆటలో భాగంగా విసిరాల్సిన బిగ్‌బాంబ్ టాస్క్‌ను తనదైన శైలిలో పూర్తి చేసింది. వేదికపై ఉత్సాహంగా గలగలా మాట్లాడుతూ కల్యాణి తన ప్రతిభను చాటుకొన్నారు. బిగ్‌బాస్ వేదికపై కరాటే కల్యాణి చేసిన హంగామా ఏమింటంటే..

Recommended Video

Bigg Boss Telugu 4: Karate Kalyani అవుట్, డబుల్ ఎలిమినేషన్ ఉత్తిదే.. సీక్రెట్ రూంలో హారిక!!
ఇంటి సభ్యుల గురించి చెబుతూ

ఇంటి సభ్యుల గురించి చెబుతూ

ఇంటి సభ్యుల గురించి తనదైన శైలిలో వివరిస్తూ ఆకట్టుకొన్నారు. గంగవ్వను ప్రశంసిస్తూనే ఆమె లోపాలను బయటపెట్టారు. కొన్ని లోపాలను అధిగమిస్తే గంగవ్వను కొట్టే వారు కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఇక మెహబూబ్ దిల్ సే కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పారు. అభిజిత్ ఇంకా గేమ్‌లోకి రాలేదని చెప్పారు. నోయల్‌ను టాప్ 10 కంటెస్టెంట్‌లో పెట్టకపోవడానికి కారణం వివరించింది. ఇలా ప్రతీ కంటెస్టెంట్‌ను ఉత్సాహ పరుస్తూ లోపాలను చెప్పింది.

 వేదికపై హరికథ అద్భుతంగా

వేదికపై హరికథ అద్భుతంగా

ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతూ కరాటే కల్యాణి తనలో ప్రతిభను ప్రేక్షక లోకానికి చాటారు. నాగ్ కోరిక మేరకు హరికథాను అద్భుతంగా చెబుతూ తన డైలాగ్ డెలివరీ పవర్‌ను చూపించారు. ఇండస్ట్రీలో తనను సరిగా వాడుకోవడం లేదనే సంకేతాలను ఆమె పంపినట్టు స్పష్టంగా అర్ధమయ్యేలా చేసింది. తనను వ్యాంప్ క్యారెక్టర్లకు వాడుకోవడం తప్పనే విధంగా తన ప్రతిభను చాటుకొన్నారు.

దేవీ నాగవళ్లిపై బిగ్‌బాంబు

దేవీ నాగవళ్లిపై బిగ్‌బాంబు

బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్లు విసిరే బిగ్‌బాంబ్‌ టాస్క్‌ను కల్యాణికి అప్పగించారు. ప్రస్తుత వారానికి ఎవరినైనా నామినేట్ చేయాలంటే వారిపై బిగ్‌బాంబ్ విసిరాలను చెప్పారు. బిగ్‌బాస్ టాస్క్‌ను తీసుకొని న్యూస్ రీడర్ దేవీ నాగవల్లిని టార్గెట్ చేసింది. ఆమెను మూడో వారం ఎలిమినేట్ అయ్యే అభ్యర్థుల జాబితాలో నామినేట్ చేసింది. దాంతో ఎలాంటి కారణం లేకుండానే దేవీ నాగవల్లి ఎలిమినేషన్ ప్రాసెస్‌లోకి వెళ్లిపోయారు.

కల్యాణి నోరు పెద్దది.. మనసు కూడా

కల్యాణి నోరు పెద్దది.. మనసు కూడా

దేవీ నాగవల్లి గురించి చెబుతూ పేరులోనే నాగ ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ కల్యాణి హెచ్చరించింది. నాగ పేరు నాలో కూడా ఉంది. మీరేమి బయపడకండి అంటూ నాగార్జున అన్నారు. ఇక వేదికపైన అలాగే మాట్లాడుతుంటే.. కల్యాణి నోరు పెద్దది, మనసు పెద్దది. ఇక ఆమె తన ప్రసంగం ఆపేలా కనిపించడం లేదు అంటూ నాగ్ డైలాగ్స్ విసిరాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా బయటకు పంపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X