బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున, రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?.. రాహుల్ కంటే శ్రీముఖి టాప్
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 రియాలిటీ షో సంపూర్ణంగా ముగిసింది. టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 100 రోజులపాటు 15 మంది కంటెస్టెంట్లతో సాగిన కార్యక్రమానికి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తర్వాత హోస్ట్, ఇతర సెలబ్రిటీల రెమ్యునరేషన్ల వివరాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. బిగ్‌బాస్ 3 షోకు సంబంధించి.. సెలబ్రీటలు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్లు అందుకొన్నారంటే..

నాగ్ రెమ్యునరేషన్ ఎంతంటే
స్టార్ మా ఛానెల్‌తో మన్మథుడు అక్కినేని నాగార్జునకు మంచి అనుబంధం ఉంది. గతంలో మా టీవీకి ఓ యజమానిగా ఉన్న ఆయన మీలో కోటీశ్వరుడు అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించాడు. ఆ అనుభవంతో తాజాగా బిగ్‌బాస్ 3 షోకు హోస్ట్‌గా రంగప్రవేశం చేసి తనదైన శైలిలో ఆకట్టుకొన్నారు. ఈ షో మొత్తంలో 30 ఎపిసోడ్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు నాగార్జునకు రూ.5 కోట్ల పారితోషికాన్ని ముట్టచెప్పినట్టు సమాచారం.

క్రేజీగా రమ్యకృష్ణ పారితోషికం
ఇక అక్కినేని నాగార్జున తన బర్త్ డే సందర్భంగా వెకేషన్స్‌కు వెళ్లడంతో ఆయన స్థానంలో హోస్ట్‌గా వ్యహరించిన అందాలతార రమ్యకృష్ణన్ అదరగొట్టింది. నా మాటే శాసనం అంటూ బిగ్‌బాస్ వేదికపై మెరుపులు మెరిపించింది. రెండురోజులపాటు హోస్ట్‌గా వ్యవహరించినందుకు గాను.. ఆమెకు 5 లక్షల రూపాయలను ఇచ్చినట్టు సమాచారం.

ప్రైజ్ మనీతోపాటు అదనంగా రాహుల్‌కు
ఇక బిగ్‌బాస్ తెలుగు విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ రు.50 లక్షల ప్రైజ్ మనీని అందుకొన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నందుకు భారీగా మొత్తం ముట్ట జెప్పినట్టు సమాచారం. 100 రోజులకుపైగా ఇంట్లో ఉన్నందుకు గాను ఆయనకు మరో రూ.30 లక్షలు ఇచ్చినట్టు సమాచారం.

శ్రీముఖి టాప్ రెమ్యునరేషన్
ఇక బిగ్‌బాస్ తెలుగు 3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి కూడా భారీగానే రెమ్యునరేషన్ అందుకొన్నారు. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకొన్న సెలబ్రిటీగా శ్రీముఖి ఘనతను సొంతం చేసుకొన్నారు. మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం.. శ్రీముఖికి రూ.80 లక్షల రూపాయలు ముట్టచెప్పినట్టు తెలిసింది. ఆమె పూర్తిస్థాయిలో ఇంటిలో ఆకట్టుకొన్న సంగతి తెలిసిందే.

వరుణ్ సందేశ్, అలీ రెజాకు ఎంతంటే
ఇక మిగితా కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. వరుణ్ సందేశ్, అలీ రెజా, బాబా భాస్కర్‌కు భారీగానే ఇచ్చినట్టు తెలిసింది. ఒక్కొక్కరికి రూ.20 నుంచి 30 లక్షల వరకు ఇచ్చినట్టు సమాచారం. మిగితా సెలబ్రిటీలకు 1 లక్ష నుంచి 15 లక్షల రూపాయల మధ్య పారితోషికాన్ని చెల్లించినట్టు తెలిపింది. అయితే ఈ వివరాలు బయట చక్కర్లు కొడుతున్న అధికారికంగా ఎలాంటి ప్రకటనలేకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











