తెలుగు బిగ్ బాస్ 3: కంటెస్టెంట్స్ లిస్టులో ప్రముఖుల పేర్లు, షో డిజైన్లో మార్పు?

Recommended Video

Bigg Boss 3 Telugu : Celebrity Names Were In Propagate By Show Organizers | Filmibeat Telugu

బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ ఎఫెక్టుతో స్టార్ మాటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోగా....నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ ఆ స్థాయికి వెళ్లక పోయినా మంచి హిట్టయింది.

ఇక 2019లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కోసం కసరత్తు మొదలైంది. షో హోస్ట్, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి షోను ఎవరు హోస్ట్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ పేరు వినిపించగా, తాజాగా విక్టరీ వెంకటేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

ఈ సారి షో ఎలా ఉండబోతోంది?

ఈ సారి షో ఎలా ఉండబోతోంది?

రెండో సీజన్ ప్రముఖులు, సామాన్యుల కలయికతో సాగింది. మూడో సీజన్లో కూడా సెలబ్రిటీలు, సామాన్యుల పోటీదారులుగా ఉంటారని తెలుస్తోంది. అయితే షో జరిగే విధానంలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

తెరపైకి టాప్ సెలబ్రిటీల పేర్లు

తెరపైకి టాప్ సెలబ్రిటీల పేర్లు

బిగ్ బాస్ తెలుగు 3 విషయంలో ఈ సారి కొందరు టాప్ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో రేణు దేశాయ్, గద్దె సింధూర, శోభిత ధూళిపాల, వరుణ్ సందేశ్, ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, జబర్దస్త్ పొట్టి గణేష్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ జాహ్నవి(మహాతల్లి) ఈ సారి షోలో పాల్గొనే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

వీరుంటే బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం

వీరుంటే బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం

బిగ్ బాస్ 2వ సీజన్... మొదటి సీజన్ స్థాయిలో హిట్ కాకపోవడానికి కారణం ఇందులో టాప్ సెలబ్రిటీలు లేక పోవడం. బిగ్ బాస్ సీజన్ 3లో టాప్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తే ఈ సారి రియాల్టీ షో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

అలాంటివి రిపీట్ కాకుండా...

అలాంటివి రిపీట్ కాకుండా...

బిగ్ బాస్ 2వ సీజన్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగడం వల్ల చాలా విషయాలు ముందే లీక్ అవ్వడం.... నిర్వాహకులకు తలనొప్పిగా మారింది. ఈ సారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే బిగ్ బాస్ 3 సెట్ ఎక్కడ వేయబోతున్నారనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X