బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై శ్వేతారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. సమంత, అమల పేర్లు తీస్తూ

Recommended Video

Bigg Boss Telugu 3 : Will Nagarjuna Be Silent If Samantha Or Amala Were Cheated, Asks Swetha Reddy

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 పై రగులుతున్న రగడ రోజురోజుకూ ముదురుతోంది.
బిగ్ బాస్ పేరిట ఓ బ్రోతల్ హౌస్ నడిపిస్తున్నారని, ఈ నిర్వహకులు మహిళలను లొంగ దీసుకుంటున్నారంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా లాంటి వారు ఆరోపించారు. ఈ మేరకు బిగ్ బాస్ వెంటనే బ్యాన్ చేయాలంటూ పోలీస్ కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరో అడుగు ముందుకేసిన శ్వేతారెడ్డి.. నాగార్జునపై ప్రశ్నల వర్షం కురిపించడం సంచలనంగా మారింది.

జులై 21 నుంచి ప్రారంభం.. ముదురుతున్న కాంట్రవర్సీ

జులై 21 నుంచి ప్రారంభం.. ముదురుతున్న కాంట్రవర్సీ

జులై 21 వ తేదీ నుంచి తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుందని ప్రకటించారు నిర్వాహకులు. ఈ మేరకు బిగ్ బాస్ ప్రోమోస్ కూడా విడుడల చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కానీ ఈ షో ప్రారంభానికి ముందే పలు వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్ బాస్ నిర్వాహకులు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారంటూ యాంకర్ శ్వేతారెడ్డి నానా హంగామా చేస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ బిగ్ బాస్‌పై బహిరంగ ఆరోపణలు గుప్పించింది.

బ్లూ ఫిల్మ్స్ చేసుకోండి అంటూ

బ్లూ ఫిల్మ్స్ చేసుకోండి అంటూ

బిగ్ బాస్ అనే రియాలిటీ షో మాటున ఆ షో నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని శ్వేతా రెడ్డి చెబుతోంది. ఈ మేరకు బిగ్ బాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమె.. ''శ్రీరెడ్డిని చెత్త చెత్త ప్రశ్నలు అడిగారు. గాయత్రి గుప్తాని అడగకూడనివి అడిగారు. అందుకే నేను అంటున్నా.. మీరు ‘బిగ్ బాస్' షో ముసుగులో అవేవో చేసే బదులు.. బ్లూ ఫిల్స్మ్ చేసుకుని డబ్బులు సంపాదించుకోండి. ఎక్కువ రేటింగులతో పాటు డబ్బులు కూడా ఎక్కువే వస్తాయి'' అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయింది.

నాతో అగ్రిమెంట్ తీసుకొని.. బాస్‌ని తృప్తి పరచాలంటూ

నాతో అగ్రిమెంట్ తీసుకొని.. బాస్‌ని తృప్తి పరచాలంటూ

బిగ్ బాస్ 3 పార్టిసిపెంట్‌గా నాతో అగ్రిమెంట్ చేసుకున్నాక నన్ను పదే పదే పిలిచి బాస్‌ని తృప్తి పరచాలని అడిగేవారని శ్వేతారెడ్డి ఆరోపణలు చేసింది. అంటే.. వాళ్ల బాస్‌ను ఇంప్రెస్ చేయాలంటే నేను బట్టలిప్పాలా..? న్యూడ్‌గా ఆయన ముందుకు వెళ్లాలా..? అంటూ శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళడిగిన దానికి తాను నో చెప్పడంతో గత కొంతకాలంగా తాను సైన్ చేసిన అగ్రిమెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని శ్వేతారెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది.

నాగార్జునపై శ్వేతారెడ్డి సంచలన కామెంట్స్

నాగార్జునపై శ్వేతారెడ్డి సంచలన కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా నాగార్జున చేయనుండటంతో తాజాగా నాగార్జునను కూడా నిలదీసింది శ్వేతారెడ్డి. నాగార్జున గారూ ఇంత ఇష్యు జరుగుతున్నా మీరు సైలెంట్ గా ఎందుకంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ ఇష్యుపై స్పందించాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది అభిమానులున్న మీరు ఇలాంటి వల్గర్ షోకి ఎలా హోస్ట్‌గా వ్యవహరించాలనుకుంటున్నారు? అని శ్వేతారెడ్డి ప్రశ్నించింది.

సమంత, అమలకు ఇదే జరిగితే నోరు మూసుకొని కూర్చుంటారా?

సమంత, అమలకు ఇదే జరిగితే నోరు మూసుకొని కూర్చుంటారా?

మీ ఫ్యామిలీలో కూడా సమంత, అమల లాంటి నటీమణులు ఉన్నారు. సో.. నాకు, నా లాంటి ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయమే మీ ఇంట్లో వారికి (సమంత, అమలకు) జరిగితే మీరు ఇలాగే నోరు మూసుకొని కూర్చుంటారా? అని నాగార్జునపై సూటి ప్రశ్న వేసింది శ్వేతారెడ్డి. చూడాలి మరి ఈమె వేసిన ప్రశ్నల పట్ల నాగార్జున రియాక్ట్ అవుతాడా? లేదా? అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X