twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో మహేష్.. అలా దురదృష్టం వెంటాడింది, నా భర్త కోసం అనుకొన్నా..కానీ నీకోసం.. శ్రీముఖి

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3 : Episode 58 Highlights || బిగ్ బాస్ కోసం త్యాగాలు.. అయ్యో మహేష్..!!

    బిగ్‌బాస్ తెలుగులో రెగ్యులర్‌గా కాకుండా నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రతీ సభ్యుడిని నేరుగా నామినేట్ చేసి వారి తరపున మరొకరు ఏదైనా టాస్క్ చేస్తే మినహాయింపు లభిస్తుంది. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు ఒకరికొకరు కొన్ని త్యాగాలకు సిద్ధపడ్డారు. కానీ మహేష్ విట్టాను మాత్రం దురదృష్టం వెంటాడింది. ఈ టాస్క్‌ ఏమేమి జరిగాయంటే..

    శ్రీముఖి ఫోన్ ఎత్తగానే

    శ్రీముఖి ఫోన్ ఎత్తగానే

    నామినేషన్ ప్రక్రియ కోసం ఇంటి ఆవరణలో టెలిఫోన్ బూత్ పెట్టారు. ముందుగా అందులోకి వెళ్లి శ్రీముఖి ఫోన్ ఎత్తగానే నీవు నేరుగా నామినేట్ అయ్యావు. నామినేషన్ నుంచి బయటకు రావాలంటే బాబా భాస్కర్ గెడ్డం, మీసాలు తీయించుకోవాలి అని చెప్పాడు. అందుకు బాబా సిద్ధపడి నీట్ షేవ్ చేయించుకొన్నారు. దాంతో నామినేషన్ నుంచి శ్రీముఖి సేఫ్ అయ్యారు.

    పునర్నవి కోసం రాహుల్

    పునర్నవి కోసం రాహుల్

    ఆ తర్వాత ఫోన్ బూత్‌లోకి పునర్నవి వెళ్లింది. నామినేషన్ నుంచి బయటకు రావాలంటే రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగాలి. పునర్నవి చెప్పగానే రాహుల్ జ్యూస్ తాగుతానని చెప్పాడు. చాలా కష్టపడుతూ రాహుల్ అన్ని గ్లాసుల కాకరకాయ జ్యూస్ తాగడంతో పునర్నవి నామినేషన్ నుంచి సేఫ్ అయింది.

    మహేష్‌ విట్టాకు చేదు అనుభవం

    మహేష్‌ విట్టాకు చేదు అనుభవం

    మూడో వ్యక్తిగా మహేష్ నామినేట్ కాగా.. నామినేషన్ నుంచి బయటకు రావడానికి హిమజ తన బట్టలు, మేకప్ కిట్ బిగ్‌బాస్‌కు ఇచ్చేయాలి. దానికి ఒప్పుకొని హిమజ బట్టలు, మేకప్ కిట్ ఇచ్చేసింది. అయితే కొన్ని బట్టలు, మేకప్ కిట్టు మిగిలిపోవడంతో మహేష్ నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించడంతో నిరుత్సాహపడ్డాడు.

    బాబా భాస్కర్ కోసం

    బాబా భాస్కర్ కోసం

    బాబా భాస్కర్ నామినేట్ కావడంతో రవిక‌ృష్ణకు సేవ్ చేసే టాస్క్ వచ్చింది. టాస్క్‌లో భాగంగా తన వద్ద ఉన్నషూస్ అన్నింటిని రంగులో ముంచేయాలి. ఎలాగైనా నా కోసం షూస్ వేయాలి అంటూ ఆర్డర్ వేశాడు బాబు. ఎలాగైనా పప్పా కోసం చేస్తానని రవికృష్ణ ముందుకు వచ్చాడు. ఇంట్లో ఉన్న చాలా జతల చెప్పులను ఎర్రటి రంగులో ముంచేశాడు. దాంతో బాబా భాస్కర్ సేఫ్ అయ్యాడు.

    శివజ్యోతి కోసం మహేష్

    శివజ్యోతి కోసం మహేష్

    శివజ్యోతి నామినేట్ కావడంతో ఆమెను సేవ్ చేయానికి మహేష్ టాస్క్ చేయాల్సి వచ్చింది. టాస్క్‌లో భాగంగా మహేష్ జుట్టుకు ఎర్రటి రంగు వేసుకోవాల్సి వచ్చింది. మహేష్ జుట్టుకు పునర్నవి రంగు వేసింది. దాంతో శివజ్యోతి నామినేషన్ నుంచి బయటకు వచ్చింది.

    శ్రీముఖి టాటూ

    శ్రీముఖి టాటూ

    వరుణ్ సందేశ్‌ను టెలిఫోన్ బూత్‌లోకి పిలిచి నామినేట్ చేశాడు. శ్రీముఖి టాటూ వేసుకొంటే నామినేషన్ నుంచి బయటకు వస్తానని చెప్పాడు. దాంతో శ్రీముఖిని అడిగితే సరేనని ఒప్పుకొన్నది. తన చేతిపై బిగ్‌బాస్ సింబల్‌ను టాటూగా వేసుకొన్నది. అంతకు ముందు నేను ఏదైనా టాటూ వేసుకొంటే నా మొగుడి పేరు వేసుకోవాలని అనుకొన్నానని చెప్పింది.

    హిమజ ఎమోషనల్

    హిమజ ఎమోషనల్

    ఇదే పద్దతిలో హిమజ నామినేట్ కాగా.. వరుణ్ సందేశ్ పేడ తొట్టిలో పడుకొంటే సేవ్ అవుతావని చెప్పాడు. దాంతో వరుణ్ సందేశ్ చాలా కష్టంగా తొట్టిలో పడుకొన్నాడు. వాంతులు వస్తున్నా ఆపుకొంటూ టాస్క్ చేశాడు. దాంతో హిమజ నామినేషన్ సేఫ్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు. కానీ ఈ టాస్క్ చాలా ఎమోషనల్‌గా సాగింది. వితిక జారి పడింది. వరుణ్ కష్టాన్ని చూసి నేను నామినేట్ అవుతానని హిమజ అరిచింది.

    English summary
    Bigg Boss 3 Telugu reality show 53 day with high emotional content. on 6th weekend funny, furious moments registred in the house. Latest elimination of Ali Reza given shock to television audience. On monday, Celebraties are in shock. But they overcome from that, participated in nomination for the Elimination. This week shilpa Chakravarthy eleminated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X