Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్.. షాకింగ్ రాహుల్ అవుట్.. భోరున ఏడ్చిన పునర్నవి
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండోసారి టాప్ కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు పోయే సన్నివేశానికి రంగం సిద్ధమైంది. ఇప్పడిప్పుడే తన సత్తాను చూపిస్తున్న రాహుల్ అనూహ్యంగా షాకిస్తూ ఎలిమినేట్ కావడం మీడియాలో చర్చనీయాంశమైంది. రాహుల్ ఇంటి బయటకు వచ్చారనే వార్త లీక్ కావడంతో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
తనదైన రీతిలో
రాహుల్ సిప్లిగంజ్ తన పాటలు, మాటలతో వినోదాన్ని, వివాదాలను సృష్టించి అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవుతున్నారు. తాను మాట్లాడే భాషపై వ్యతిరేకత వ్యక్తమైనా తన శైలిలోనే అందరికీ జవాబిచ్చాడు. హోస్ట్ నాగార్జున, ఇంటిలోకి వచ్చే అతిథులపై అప్పటికప్పుడు పాటల కడుతూ ఆకట్టుకొన్నారు.
పునర్నవి షాక్‌తో బుక్
ప్రస్తుత వారానికి సంబంధించి ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అనూహ్యంగా రాహుల్ సిప్లింగజ్ బుక్కయ్యాడు. పునర్నవి ఇచ్చిన షాక్‌తో నామినేట్ అయ్యాడు. అయితే స్ట్రాంగ్ సెలబ్రిటీలో కావడంతో అందరూ బయటపడ్డుతారని అనుకొన్నారు.
రాహుల్ ఎలిమినేటెడ్
కానీ ఈ వారం మహేష్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్ నామినేషన్లో ఉన్నారు. శనివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో రాహుల్‌ను శనివారం ఎపిసోడ్‌లోనే బయటకు పంపించారన్నది ఏకంగా హోస్ట్ నాగార్జున వెల్లడించడం షాక్ గురి చేసింది. రాహుల్ ఇంటి నుంచి బయటకు పోవడమనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వారం డబుల్ నామినేషన్ ఉందనే మాట కూడా వినిపిస్తున్నది.
కంటతడి పెట్టిన పునర్నవి
రాహుల్ ఎలిమినేషన్ కావడంతో పునర్నవి కంటతడి పెట్టారు. ఇక ఎవరిని నేను తిట్టాలి. నాకు క్లోజ్ ఫ్రెండ్ బయటకు పోతే నా పరిస్థితి అంటూ భావోద్వేగానికి లోనైంది. ఏకంగా భోరున ఏడుస్తూ కంటతడి పెట్టింది. ప్రస్తుతం ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
డబుల్ ఎలిమినేషన్?
అయితే డబుల్ నామినేషన్ ప్రక్రియలో మరో కంటెస్ట్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు వెంటాడుతున్నది. ఇంటి నుంచి ఎవరిని హోస్ట్ నాగ్ బయటకు పంపిస్తారనే విషయం ఆసక్తిగా మారడంతో శనివారం, ఆదివారం బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు హత్తుకుపోవడం ఖాయమనే మాట వినిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ వారం ఈ షో మంచి రేటింగ్ సాధించే అవకాశం ఉంది.