కేక పెట్టించిన రమ్యకృష్ణ.. చంద్రముఖిగా శ్రీముఖి, ఆ ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్, ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అతిథి హోస్ట్‌గా రమ్యకృష్ణ కేక పెట్టించారు. ఆదివారంను ఫన్ డే‌గా మలవడంతో తనదైన సత్తాను చాటారు. ఇంటి సభ్యులతో వినోదాత్మక గేమ్స్ ఆడించడమే కాకుండా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. అలాగే ఇంటిలోకి ప్రవేశించి ఇంటి సభ్యులతో మమేకమయ్యారు. అలాగే ఈ వారం ఇంటి సభ్యుల్లో ఎవరిని ఎలిమినేట్ చేశారంటే..

సీతమ్మ వాకిట్లో.. రవికృష్ణ, ఆలీ రెజా..

సీతమ్మ వాకిట్లో.. రవికృష్ణ, ఆలీ రెజా..

రమ్యకృష్ణ నిర్వహించిన ఫన్ ‌టాస్‌లో మొదటగా రవికృష్ణ, అలీ రెజాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలోని సీన్లు ఇచ్చి నటించమన్నారు. పూల కుండి పగులగొట్టే సీన్‌ను ఇచ్చారు. ఈ సీన్‌లో రవికృష్ణ, అలీ బాగా నటించారు. సహజసిద్ధమైన నటనతో పాటు ఇంప్రూవైజ్ కూడా చేశారు.

రంగస్థలంపై శివజ్యోతి, మహేష్ విట్ట, హిమజ

రంగస్థలంపై శివజ్యోతి, మహేష్ విట్ట, హిమజ

శివజ్యోతి, మహేష్ విట్ట, హిమజకు రంగస్థలంలోని ఓ సీన్‌ను ఇచ్చారు. మహేష్ రాంచరణ్‌గా, శివజ్యోతి రంగమ్మగా, హిమజ సమంతగా యాక్ట్ చేశారు. రంగమ్మత్త, చిట్టిబాబు, సమంతగా ముగ్గురు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారి ఫెర్ఫార్మెన్స్‌ను రమ్యకృష్ణ మెచ్చుకొని ప్రశంసించారు.

చంద్రముఖిలో శ్రీముఖి, బాబా భాస్కర్

చంద్రముఖిలో శ్రీముఖి, బాబా భాస్కర్

ఇక ఆ తర్వాత బాబా భాస్కర్, శ్రీముఖి కోసం చంద్రముఖి సీన్‌లో లకలక సీన్‌ను ఇచ్చారు. ఈ సీన్‌లో శ్రీముఖి చంద్రముఖిగా, బాబా భాస్కర్ రజనీకాంత్‌గా నటించి సన్నివేశాన్ని పండించారు. శ్రీముఖి పాత్రలో లీనమై నేచురల్ ఫెర్ఫార్మెన్స్‌ను చూపించారు. వారిద్దరి నటన చూసి రమ్యృష్ణ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అద్భుతంగా సీన్ పండించారంటూ వారిద్దరిని అభినందించారు.

ఖుషీగా రాహుల్, పునర్నవి

ఖుషీగా రాహుల్, పునర్నవి

రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి భూపాళంను ఓ జంటగా మార్చి.. ఖుషీ సీన్‌లోని నడుము చూసే సీన్‌ను చేయాలని సూచించారు. ఇక పునర్నవి, రాహుల్ ఆ పాత్రల్లో జీవించారు. రాహుల్ తనదైన స్టయిల్‌లో, డైలాగ్స్‌తో రఫాడించారు. నా మీద నీకు ప్రేమ లేదా? అంటే .. నా మీద నీకు ప్రేమ లేదా అంటూ చెప్పిన డైలాగ్స్‌తో వారిద్దరి కెమిస్ట్రీ అదిరింది. ఈ ఎపిసోడ్‌లో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే పాటను ప్లే చేయగా వారిద్దరూ డ్యాన్స్ చేశారు. రాహుల్ నటనను రమ్యకృష్ణ మెచ్చుకొన్నది.

డబుల్ ఫన్‌తో వితిక, వరుణ్

డబుల్ ఫన్‌తో వితిక, వరుణ్

ఇక వితిక, వరుణ్ సందేశ్ జంటకు ఎఫ్2 సీన్‌ను చేయమనగా.. వారిద్దరూ భార్యభర్తలుగా నటించారు. పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత పరిస్థితులను క్రియేట్ చేసుకొని వారిద్దరూ బాగా నటించారు. మల్లెపూలు సీన్ ఆకట్టుకొన్నది. బిగ్‌బాస్‌లోకి వచ్చాక ముద్దు, మురిపాలు లేవని అంటే.. ఇక్కడ ముద్దులు పెట్టుకొంటే బాగుండదు అని వరుణ్ చమత్కరించారు. వీరిద్దరి నటనకు రమ్యకృష్ణ ఫిదా అయ్యారు.

విజేతగా బాబా భాస్కర్, శ్రీముఖి

విజేతగా బాబా భాస్కర్, శ్రీముఖి

ఇక ఫన్ గేమ్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులు, తాను ఇచ్చిన మార్కుల ఆధారంగా విజేతను నిర్ణయించారు. అత్యధిక మార్కులు వచ్చిన బాబా మాస్టర్, శ్రీముఖి జంట విజేతగా నిలిచింది. ఆ తర్వాత రాహుల్, పునర్నవి, వితిక, వరుణ్ సందేశ్ జంటలు తరువాత స్థానాల్లో నిలిచాయి. అనంతరం ఇంటిలోకి ప్రవేశించి రమ్యకృష్ణ ఇంటి సభ్యులకు షాకిచ్చింది. రమ్యకృష్ణను చూడగానే ఇంటి సభ్యులు కేకలు పెట్టారు.

ఎలిమినేషన్ ప్రాసెస్

ఎలిమినేషన్ ప్రాసెస్

అనంతరం నల్లటి గులాబీలతో ఓ ఆట ఆడించింది. ఎక్కువగా నల్లపూలు వచ్చిన వారు ఇంటి నుంచి బయటకు వెళుతారని చెప్పింది. ఆ గేమ్‌లో మహేష్ విట్టకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే అనూహ్యంగా షాకిస్తూ.. ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పారు. వినాయక చవితి సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పింది. అలాగే వచ్చే వారం కింగ్ నాగార్జున ఇంట్లోకి వస్తారని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X