బిగ్‌బాస్ నుంచి ఆ సెలబ్రిటీ అవుట్? నాగార్జున స్థానంలో కొత్త హోస్ట్!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ 3 షోలో ఈ వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇంటి నుంచి ఐదుగురు సభ్యులు హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అశురెట్టి బయటకు వెళ్లిపోయారు. అయితే ఈ వారం నామినేషన్‌లో చివరకు ముగ్గురు పునర్నవి భూపాలం, మహేష్ విట్ట, హిమజ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఆసక్తిగా మారింది. అయితే తాజా ఓటింగ్ ప్రకారం విరాలు ఇలా ఉన్నాయి.

ఈ వారం ఎలిమినేషన్‌లో
వాస్తవానికి ప్రస్తుత వారంలో భూపాలం, మహేష్ విట్ట, హిమజ రెడ్డి, రవికృష్ణ, వరుణ్ సందేశ్, రహుల్ సిప్లిగంజ్ నామినేట్ అయ్యారు. కానీ బిగ్‌బాస్ చేసిన మాయతో రవికృష్ణ, వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్ బయటపడ్డారు. ఇంటిలో సీక్రెట్ టాస్క్ ద్వారా నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. దాంతో ఆ ముగ్గురే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగమయ్యారు.

అత్యంత బోర్‌గా
ప్రస్తుతం వారంలో బిగ్‌బాస్ అత్యంత బోర్‌గా నడించింది. ఎలిమినేషన్‌లో ఉన్న సభ్యులు తమ ప్రతిభను బయటపెట్టుకొవడానికి కూడా ఛాన్స్ లేకుండా గేమ్ ఆడించారు. ఇక దాంతో ఈ వారం అన్ని ఎపిసోడ్స్ చాలా దారుణంగా ముందుకు సాగాయి. శనివారం స్పెషల్ హోస్ట్‌గా రమ్యకృష్ణ వేదికపైకి హోస్ట్‌గా వచ్చి ఝలక్ ఇవ్వనుంది. ఆమె సెలబ్రిటీలకు ఎలా ఉత్సాహం నింపుతారో వేచి చూడాల్సిందే.

హిమజపై ఎలిమినేషన్ కత్తి
ఇక ఈ వారం నామినేషన్‌లో ఉన్న మహేష్ విట్ట, పునర్నవి, హిమజలో ఎవరు బయటకు వెళ్తారనేది ఆసక్తిగా మారింది. ఈ ముగ్గురిలో చాలా స్ట్రాంగ్‌గా, కంటెంట్‌తోపాటు గ్లామర్‌గా ఆకట్టుకొంటున్నది పునర్నవి. తనకు ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా ఆమె ఎలిమినేషన్ నుంచి తప్పించుకొనే అవకాశం ఉంది. ఇక పునర్నవి తర్వాత వివాదాలతో, కంటెంట్ పరంగా మహేష్ విట్ట సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. చివరకు ముప్పు ఉన్న హిమజనే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఓటింగ్ ఇలా జరిగిందని
ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే.. మహేస్ విట్టకు 25.62 శాతం, పునర్నవికి 24.43 శాతం, హిమజ రెడ్డికి 18.73 శాతం వచ్చినట్టు తెలిసింది. దాంతో హిమజ ఎక్కువ శాతం ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఆదివారం ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











