బిగ్‌బాస్ ఎలిమినేషన్: వరుణ్ సందేశ్‌కు షాక్.. ఇంటి నుంచి బయటకు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 చివరి దశకు చేరుకొన్నది. టాప్ 5 కంటెస్టెంట్స్‌ ఎవరు అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇంకా రెండు వారాల గడువు ఉన్న రియాలిటీ షోలో కీలకమైన అంశాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది. చివరి మూడోవారం ఎలిమినేషన్‌‌లో వరుణ్ సందేశ్ దంపతులకు షాక్ తగిలింది. ఈ వారం ఈ జంట వీడిపోనున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరంటే..

జోడిగా వితిక దంపతులు

జోడిగా వితిక దంపతులు

టాలీవుడ్ తారలు వరుణ్ సందేశ్, వితిక్ షేర్‌ దంపతులు బిగ్‌బాస్ ఇంటిలోకి జోడిగా ప్రవేశించారు. తొలిసారి ప్రయోగాత్మకంగా కపుల్ కంటెస్టెంట్స్‌ను ఈ గేమ్‌లోకి పంపించారు. అయితే అనుకొన్న విధంగా వరుణ్ సందేశ్, వితిక షేర్ జంట ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన తక్కువే అనే విమర్శలు వినిపించాయి.

వితికతో వరుణ్

వితికతో వరుణ్

వితిక షేర్ అప్పుడప్పుడు టాస్కులలో కొంత మేరకు రాణించినా పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఇక వితిక్‌ ఆట వరుణ్‌పై ప్రభావం చూపించింది. వితిక వల్ల వరుణ్ తన ఆటను సరిగా ఆడటం లేదనే పలుమార్లు హోస్ట్ నాగార్జున బహిరంగంగానే కామెంట్ చేశారు. దాంతో వారిద్దరూ తమ గేమ్‌ను సరిదిద్దుకొన్నారు. ఆ తర్వాత వితిక, వరుణ్ కొంత ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

కాన్ఫిడెన్స్ పెంచుకొని

కాన్ఫిడెన్స్ పెంచుకొని

ఇక కెప్టెన్‌గా ఎన్నిక కావడం, గత కొద్ది రోజుల క్రితం మెడాలియన్ టాస్క్‌లో విజేతగా నిలువడం వితికలో కాన్ఫిడెన్స్‌ను పెంచింది. ఇక పలుమార్లు వితికకు వరుణ్ అండగా నిలువడంతో కొన్ని సమస్యలను గట్టెక్కింది. ఇలా వితిక దాదాపు 11 వారాలాపాటు జోరుగా బిగ్‌బాస్ హౌస్‌లో రాణించింది.

ఎలిమినేషన్‌తో బయటకు

ఎలిమినేషన్‌తో బయటకు

శనివారం బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్ సేవ్ అయ్యారు. కాగా కడపటి వార్తలు అందే సరికి అనూహ్య పరిస్థితుల్లో వితిక్ షేర్‌ బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలిసింది. వితిక్ ఎలిమినేషన్‌ను తట్టుకోలేక వరుణ్ షాక్ గురయ్యారనే అంశం ఆదివారం ఎపిసోడ్‌లో ప్రసారం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X