Himaja ఆ వయసులోనే అబ్బాయి వెంటపడ్డాడు.. లవ్ మ్యాటర్ లీక్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, గ్లామర్ పాత్రలతో ఆకట్టుకొంటున్న నటి హిమజ అలియాస్ హిమజా మలిరెడ్డి. తెలుగు టెలివిజన్ రంగంలో కూడా పలు షోలు, ఈవెంట్లలతో తనదైన ప్రతిభను చాటుకొంటూ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆమె 10th Class dairies అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా టీజర్ వేడుకలో పాల్గొంటూ... తన పదో తరగతి అనుభవాలను ఆసక్తికరంగా వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె చెప్పిన విషయాలు, అలాగే హిమజ గురించిన వివరాల్లోకి వెళితే..

2015లో సినీ రంగంలోకి ప్రవేశం
హిమజ కెరీర్ విషయానికి వస్తే.. 2015లో శివమ్ అనే చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత నేను శైలజ, చుట్టలబ్బాయి, జనత గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, స్పైడర్, వినయ విధేయ రామ, తాజాగా వరుడు కావలెను చిత్రాల్లో నటించింది. వరుడు కావలెను చిత్రంలో తనదైన కామెడీని పండించి ఆకట్టుకొన్నారు.

టెలివిజన్ రంగంలో
ఒకవైపు సినిమా రంగంలో రాణిస్తూనే టెలివిజన్ రంగంలో కూడా తనదైన ప్రతిభను చాటుకొంటున్నారు. 2013లో భార్యమణి షో ద్వారా టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత స్వయంవరం, సూపర్ 2, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, కెవ్వు కబాడ్డీ షోలో మంచి పాపులారిటీని సంపాదించుకొన్నారు. యాంకర్‌గా, హోస్ట్‌గా విభిన్నమైన భూమికను పోషిస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 3 షోలో
ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో పాల్గొన్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని టెలివిజన్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. బిగ్‌బాస్ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ లభించింది. బిగ్‌బాస్ తర్వాత టీవీ, సినిమాల్లో బిజీగా మారిపోయారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఓ అబ్బాయి అలా ప్రపోజ్ చేశారంటూ
ఇక 10 క్లాస్ డైరీస్ సినిమా ఫంక్షన్‌లో నటి హిమజ మాట్లాడుతూ.. టెన్త్ క్లాస్ చదివిన ప్రతి ఒక్కరికీ బోలెడు మెమరీస్ ఉంటాయి. పదో తరగతిలో ఉండగా... దసరాకు నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. అతని పేరు చెప్పను. ఎక్కడ ఉన్నాడోతెలియదు కదా! టెన్త్ క్లాస్ నేపథ్యంలో తెరకెక్కిన మంచి సినిమాలో నేను కూడా నటించడం సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ చేసేటప్పుడు మా నిర్మాత అచ్యుతరామారావుగారిని చూసి షాక్ అయ్యా. మామూలుగా షూటింగ్ క్యాన్సిల్ అయితే నిర్మాతలు టెన్షన్ పడతారు. ఆయన బాంబు పడినా కూల్ గా చెబుతారు. అంజిగారుకెమెరా వర్క్ చూసుకుంటూ డైరెక్షన్ బాగా చేశారు అని అన్నారు.
Recommended Video

10 క్లాస్ డైరీస్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణుల
నటీనటులు: శ్రీరామ్, అవిక గోర్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, మధుమిత, సత్యం రాజేశ్, భానుశ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, తాగుబోతు రమేష్, చిత్ర శ్రీను, గీతా సింగ్, జబర్దస్త్ రొహిని తదితరులు
నిర్మాత: పీ అచ్యుత రామారావు, రవితేజ మన్యం
దర్శకత్వం: సినిమాటోగ్రఫి: గురుడవేగ అంజి
సహ నిర్మాత: రవి కొల్లిపార
సమర్పణ: అజయ్ మైసూర్
కథ: రామారావు
డైలాగ్స్, స్క్రీన్ ప్లే: శృతి కార్తీక్
సాహిత్యం: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ బొబ్బిలి
కొరియోగ్రఫి: శేఖర్ వీజే, విజయ్ బిన్ని, సన్నీ
ఫైట్స్: స్టంట్ జాషువా
ఎడిటర్: ప్రవీణ్ పూడి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా
మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
రిలీజ్ డేట్: మార్చి 4, 2022


Click it and Unblock the Notifications











