బిగ్‌బాస్‌ ఫైనల్‌కి సర్‌ప్రైజింగ్ గెస్ట్.. వేదిక దద్దరిల్లేలా మెగా ప్లాన్.. ఈ సండే పండగే!

Recommended Video

Bigg Boss Telugu 3 : Chief Guest Confirmed For Telugu Bigg Boss Finale? || Episode 100 Highlights

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. మూడో సీజన్ ముగింపు ముంగిట ఉంది. ఈ ఆదివారమే అనగా నవంబర్ 3వ తేదీన బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు? ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు? అనే విషయాలపై ఆసక్తికర అప్‌డేట్స్ బయటకొస్తున్నాయి.

గ్రాండ్‌ ఫినాలే పై చర్చలు.. జనాల్లో ఉత్కంఠ

గ్రాండ్‌ ఫినాలే పై చర్చలు.. జనాల్లో ఉత్కంఠ

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాలు ఉన్నారు. దీంతో ఈ ఐదుగురిలో విజయం ఎవరిది అనే దానిపై జనాల్లో ఉత్కంఠ నెలకొంది. సీజన్ 3 టైటిల్ ఎవరికీ వస్తుంది? గ్రాండ్‌ ఫినాలే ఎంత రసవత్తరంగా సాగనుంది అనే దానిపై చర్చలు ముదిరాయి.

గత సీజన్ల కంటే ఘనంగా ఉండేలా.. మెగాస్టార్ హ్యాండ్

గత సీజన్ల కంటే ఘనంగా ఉండేలా.. మెగాస్టార్ హ్యాండ్

మరోవైపు బిగ్‌బాస్‌ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఈ షో నిర్వాహకులు. గత సీజన్ల కంటే ఘనంగా ఈ సీజన్ 3 ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఫైనల్ ఎపిసోడ్‌కి వచ్చే గెస్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారట. ఫైనల్ ఎపిసోడ్ ప్రత్యేక అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవిని తీసుకొచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసిందట బిగ్ బాస్ టీమ్.

రియల్ బిగ్ బాస్ రాకతో.. వేదిక దద్దరిల్లేలా

రియల్ బిగ్ బాస్ రాకతో.. వేదిక దద్దరిల్లేలా

చిరంజీవిని వేదిక మీదకు రప్పించి ఫైనల్‌ వార్‌ను మరింత రక్తి కట్టించాలనేది బిగ్ బాస్ నిర్వాహకుల స్కెచ్ బి తెలుస్తోంది. చేతుల మీదుగా బిగ్‌బాస్‌ విజేతకు టైటిల్‌ అందజేసి సీజన్ 3 కి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని చూస్తున్నారట. మెగాస్టార్ రాకతో పాటు బిగ్ బాస్ వేదిక దద్దరిల్లేలా చర్యలు చేపడుతున్నారని తెలుస్తోంది.

హీరోయిన్ల అందాలు.. మెగాస్టార్ చిందులు

హీరోయిన్ల అందాలు.. మెగాస్టార్ చిందులు

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి హీరోయిన్ల అందాలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయని తెలుస్తోంది. చిరంజీవితో పాటు టాలీవుడ్ లోని కొందరు హీరోయిన్స్ బిగ్ బాస్ ఫైనల్ షోకి రానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. హీరోయిన్ల అందాల నడుమ మెగాస్టార్ చిందులు బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌‌లో స్పెషల్ కిక్ ఇవ్వనున్నాయన్నమాట.

చిరు సందడి ఖాయమే..

చిరు సందడి ఖాయమే..

ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమా పూర్తి చేసి ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నారు చిరంజీవి. పైగా నాగార్జున, చిరంజీవి మధ్య మాంచి బాండింగ్ కూడా ఉంది. కాబట్టి బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌లో చిరు సందడి ఖాయమే అని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X