బిగ్ బాస్ 3 ఫైనల్ సీక్రెట్స్ లీక్.. ఆ ఇద్దరినీ సాగనంపిన రాశి ఖన్నా, అంజలి

బుల్లితెర పాపులారిటీ షో బిగ్ బాస్ తుది ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. 100 రోజుల పాటు ఎంటర్‌టైన్ చేసిన ఈ షోని సాగనంపేందుకు సిద్దమయ్యారంతా. ఈ రోజే (ఆదివారం) బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు జరగనుంది. ఈ నేపథ్యంలో కంటిస్టెంట్ల ఓటింగ్, ఫైనల్ ఎపిసోడ్ విశేషాలకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్లు రాశి ఖన్నా, అంజలికి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. వివరాల్లోకి పోతే..

అట్టహాసంగా ఫైనల్ ఎపిసోడ్.. సీక్రెట్స్ రివీల్

అట్టహాసంగా ఫైనల్ ఎపిసోడ్.. సీక్రెట్స్ రివీల్

ఇన్నాళ్లు ఎంతో ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు వేడుకలను ఎంతో అట్టహాసంగా ప్లాన్ చేశారు మేకర్స్. బిగ్ బాస్ కంటిస్టెంట్లు, తెలుగు హీరోయిన్ల అందాలు ఈ షోకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా అన్నీ సిద్ధం చేసింది బిగ్ బాస్ మేనేజ్‌మెంట్. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ సీక్రెట్స్ కొన్ని బయటకు వస్తున్నాయి.

ఎంటరైన హీరోయిన్లు.. ఒక్కో కంటిస్టెంట్‌ని అలా!

ఎంటరైన హీరోయిన్లు.. ఒక్కో కంటిస్టెంట్‌ని అలా!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారని టాక్. అదేవిధంగా హీరోయిన్లు నిధి అగర్వాల్, క్యాథరిన్, అంజలి, రాశి ఖన్నా సహా పలువురు అందగత్తెలు బిగ్ బాస్ వేదికపై చిందులేస్తూ హంగామా చేయనున్నారట. అయితే బిగ్ బాస్ కంటిస్టెంట్లలో ఎలిమినేషన్‌కి సంబంధించి ఏయే హీరోయిన్ ఏయే కంటిస్టెంట్‌ని ఎలిమినేట్ చేయనుందనేది తెలిసింది.

Recommended Video

Bigg Boss Telugu 3 : Sreemukhi Stands As Runner Up & Clicks Selfie With Chiranjeevi
బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు.. అందులో క్లారిటీ

బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు.. అందులో క్లారిటీ

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటిస్టెంట్స్ ఉన్నారు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్‌ లు ఫైనల్ రేస్‌లో బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే సోషల్ మీడియా సందేశాలు, ఓటింగ్ ప్రకారం ఇప్పటికే విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చారు జనం.

రాశి ఖన్నా, అంజలి చేతుల మీదుగా

రాశి ఖన్నా, అంజలి చేతుల మీదుగా

తాజాగా సోషల్ మీడియాలో షికారు చేస్తున్న సమాచారం మేరకు బిగ్ బాస్ కంటిస్టెంట్ అలీ రెజాను హీరోయిన్ రాశి ఖన్నా ఎలిమినేట్ చేస్తుందని తెలిసింది. అలాగే మరో హీరోయిన్ అంజలి చేతుల మీదుగా బాబా భాస్కర్‌ ఎలిమినేషన్ జరుగుతుందని తెలిసింది. ఇక ఎలిమినేషన్ లిస్ట్‌లో వరుణ్ సందేశ్ పేరు మొదటి ఉంటుందని సమాచారం.

ఎంతో రహస్యంగా ఉంచాల్సిన అంశాలు ఇలా లీక్

ఎంతో రహస్యంగా ఉంచాల్సిన అంశాలు ఇలా లీక్

మొదటి వారం నుంచి ఇదే తంతు.. బిగ్‌బాస్ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించడంతో.. రహస్యంగా ఉంచాల్సిన ప్రతీ విషయం లీకవుతూనే ఉంది. మొదటి వారంలో మొదలైన ఈ లీకులు.. చివరకు ఎంతో రహస్యంగా ఉంచాల్సిన విజేత విషయంలో కూడా అదే జరిగింది. ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిన పని లేకుండా శనివారం సాయంత్రమే తెలిసిపోయింది.

విన్నర్.. రన్నర్ ఎవరంటే!

విన్నర్.. రన్నర్ ఎవరంటే!

రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్‌గా నిలిచాడని తెలుస్తోంది. చివరి వరకు ఉత్కంఠగా నిలిచిన పోరులో శ్రీముఖిని పడగొట్టి రాహుల్ విజేతగా నిలిచాడని లీక్ బయటకొచ్చింది. ఓటింగ్‌లో హోరాహోరీగా పోటీ పడిన శ్రీముఖి చివరకు రన్నరప్ గానే నిలవాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X