బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : బిగ్‌బాస్‌లోకి బిగ్ బాస్ ఎంట్రీ.. పంచ్‌లతో అదరగొట్టిన చిరు

Recommended Video

Bigg Boss Telugu 3 : Sreemukhi Stands As Runner Up & Clicks Selfie With Chiranjeevi

జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచాయి. స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరించారు.

నాగ్ ఆఫర్‌ను తిరస్కరించిన ఇద్దరు

నాగ్ ఆఫర్‌ను తిరస్కరించిన ఇద్దరు

టాస్ 2లో మిగిలిన ఇద్దరిని పలకరించేందుకు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ్. వారితో కాసేపు సరదాగా మాట్లాడాడు. వారి జర్నీలకు సంబంధించిన వీడియోలను ప్లే చేసి చూపించాడు. వంద రోజులకు పైగా కష్టపడి టాప్2లోకి వచ్చిన రాహుల్, శ్రీముఖిలకు చివరగా నాగ్ ఓ ఆఫర్‌ను ఇచ్చాడు. ప్రైజ్ మనీ యాభై లక్షలని, ఇద్దరికీ చేరో రూ.25లక్షలు ఇస్తానని డీల్ మాట్లాడాడు. కానీ దాన్ని వారిద్దరూ తిరస్కించేశారు.

మెగాస్టార్ ఎంట్రీ

మెగాస్టార్ ఎంట్రీ

వంద రోజులకు పైగా ప్రయాణం.. హోరాహోరీ పోరులో పదిహేడు మంది కంటెస్టెంట్లు.. చివరకు గెలిచేది ఒక్కరే. ఎంతో కష్టపడి టాప్5కు చేరుకున్న కంటెస్టెంట్లలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ టైటిల్ విజేత ఎవరన్న ఉత్కంఠకు తెరదించుతూ.. విన్నర్‌ను ప్రకటించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. టాప్5లోంచి అలీ, వరుణ్, బాబా ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఇద్దరి భవిష్యత్తును తేల్చేందుకు చిరు వచ్చేశాడు.

పంచ్‌లతో అదరగొట్టిన చిరు..

పంచ్‌లతో అదరగొట్టిన చిరు..

ఫినాలె ఎపిసోడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిరు.. విజేతను ప్రకటించేందుకు బిగ్‌బాస్ స్టేజ్ మీదకు వచ్చేశారు. టీఆర్పీలో ప్రపంచంలోనే నెంబర్ వన్ షో అని.. ఫినాలే ఎపిసోడ్‌కు తనను పిలిచినందుకు చిరంజీవి ధన్యవాదాలను తెలిపారు. రాగానే నాగ్‌ను ఇరకాటంలోకి నెట్టాడు. ఉన్న ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పమని నాగ్‌ను ప్రశ్నించాడు. కోపం కూకట్ పల్లిలో ఉండే నాగార్జున నార్కట్ పల్లిలో ఉంటాడంటూ నాగ్‌పై అదరిపోయే పంచ్ వేశాడు. ఖాన్ కే నీచే అంటూ నాగ్ కోప్పడిన సంఘటనను తన స్టైల్లో చెప్పేశాడు. చిరు కోరిక మేరకు వేసిన నాగ్ మాటల డీజే అదిరిపోయింది. దీంతో పాటు నాగ్ జర్నీ వీడియోను కూడా ప్లే చేయించేలా చేశాడు.

 హౌస్‌మేట్స్ అందర్నీ పలకరించిన చిరు..

హౌస్‌మేట్స్ అందర్నీ పలకరించిన చిరు..

అందరిని పేరు పేరును పలకరిస్తూ సరదగా ముచ్చటించారు. పునర్నవి అంటే.. అలా కాదు పునర్నవి గారు అని పిలవాలని నాగ్ సూచించడం.. చిరు కూడా అంతే వినయంగా నటించడం. రోహిణి ఐ లవ్యూ అని చెబితే.. చిరు అవాక్కయ్యాడు. తమన్నా నిజం చెప్పే ధైర్యాన్ని మెచ్చుకున్నాడు. బాబా భాస్కర్ బాగా నటించాడని.. సారి సారీ అంటూ బాబాపై కౌంటర్ వేశాడు. శివజ్యోతి తన యాసలోనే పలకరించాడు. సిక్స్ ప్యాక్ అంటూ అలీ గ్లామర్‌ను పొగిడాడు. యాంగ్రీ యంగ్‌మెన్ అంటూ మహేష్ విట్టాను, ప్రశ్నలను ఎంతగా ఇబ్బంది పెట్టారంటూ శిల్పాను, కాంట్రవర్శీ అంటూ జాఫర్‌తో జాగ్రత్త, ఎవరి శాపమో అంటూ కౌంటర్ వేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X