నాగ్ నా బాయ్‌ఫ్రెండ్.. షాకిచ్చిన శ్రీముఖి, ఏరా ఎలా ఉందని పొన్ను, బాబా శాపంతో శిల్ప అవుట్

Recommended Video

Bigg Boss Telugu 3: బాబా శాపంతో శిల్ప అవుట్!! | Episode 57 Highlights | Filmibeat Telugu

హోస్ట్‌గా నాగార్జున బిగ్‌బాస్ రియాలిటీ షోను సందడిగా మార్చేశాడు. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఇంటి సభ్యులను మొదట ఆనందంలో ముంచెత్తి.. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు. ఇంటిలో రెండు రకాల ఆటలను ఆడించి ఇంటి సభ్యులను ఉత్తేజ పరిచారు. వారాంతం ఇలా హ్యాపీగా గడిచిపోయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..

శ్రీముఖికి పెళ్లిచూపులు

శ్రీముఖికి పెళ్లిచూపులు

హోస్ట్ నాగార్జున ఎపిసోడ్ ప్రారంభిస్తూ ఇంటి సభ్యులతో స్కిట్స్‌ను ఆడించాడు. శ్రీముఖి పెళ్లికూతురిగా నటించాలి. కాకపోతే పెళ్లి చూపుల రోజున ఆమె గొంతు మగవాడి గొంతులా మారిపోతుంది. పెళ్లి చూపుల సమయంలో శ్రీముఖి ఎలా హ్యాండిల్ చేసిందనే కాన్సెప్ట్‌తో స్కిట్ మొదలైంది. అత్తగా శిల్ప, పెళ్లికొడుకుగా మహేష్ విట్టా, స్నేహితుడిగా వరుణ్ సందేశ్ నటించాడు. శ్రీముఖి అద్బుతంగా నటించింది. చివర్లో నా బాయ్‌ఫ్రెండ్ నాగార్జున అంటూ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది.

పునర్నవి, రాహుల్ లవ్ స్కిట్

పునర్నవి, రాహుల్ లవ్ స్కిట్

పునర్నవి, రాహుల్ లవర్స్‌గా నటించారు. అయితే ప్రేమలోకి దించి మెప్పించే క్రమంలో సంభాషణ ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం మాట్లాడాలో చెవి రింగులు తోచక కోఠిలో కొన్నావా? అంటూ రాహుల్ అంటే.. పునర్నవి చిరాకకు పడింది. వారిద్దరి గిల్లికజ్జాలు ఫన్‌గా మారింది. మధ్యలో పునర్నవి బాయ్‌ఫ్రెండ్‌గా బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ ముగ్గురి మధ్య ఎపిసోడ్ వినోదాన్ని పంచింది. కోపంలో కూడా పోరి అందంగా ఉందే అని అన్నాడు. అంతలోనే లవర్ బాబా ప్రవేశించాడు. నిన్ను ఏడిపించే వాడిని నరికేస్తాను అంటూ బాబా డైలాగ్ పేల్చాడు.

ప్రేమలోకి దించేందుకు మహేష్

ప్రేమలోకి దించేందుకు మహేష్

మహేష్, రవికృష్ణ, హిమజ కలిసి మరో స్కిట్‌ను ప్రదర్శించారు. హోటల్‌లో తన ఆర్డర్‌ను హిమజ తినేయడంతో రవికృష్ణ కోపం తెచ్చుకొన్నాడు. వారి మధ్య గొడవలో మహేష్ దూరి.. హిమజకు లైన్ వేశాడు. లవ్‌లోకి దించేందుకు మహేష్ చేసిన యాక్టింగ్ బాగుంది.

తిరుపతి ఎపిసోడ్‌లో బాబా భాస్కర్

తిరుపతి ఎపిసోడ్‌లో బాబా భాస్కర్

వితిక, శ్రీముఖి, బాబా భాస్కర్ ముగ్గురు ప్రదర్శించిన తిరుపతి ఎపిసోడ్‌ బాగుంది. వితిక దర్శనానికి వస్తే.. శ్రీముఖి ఆమె నుంచి డబ్బులు గుంజేందకు ప్రయత్నించే పాత్రను పోషించింది. బాబా భాస్కర్ డబ్బులు నొక్కేసే పోలీస్‌గా నటించాడు. వీరిద్దరి మధ్య సంభాషణ ఫన్‌గా ఉంది.

శిల్ప చక్రవర్తి ఎలిమినేటెడ్

శిల్ప చక్రవర్తి ఎలిమినేటెడ్

చివర్లో ఎలిమినేషన్‌లో పునర్నవి, శిల్ప చక్రవర్తి నిలిచారు. కన్ఫెషన్ రూమ్‌లోకి శిల్పను పంపించారు. అలాగే పునర్నవిని కోర్టు యార్డులోకి పంపించారు. ఎవరి డోర్ ఓపెన్ అవుతుందో వారు హాల్‌లోకి రావాలి. అలా వచ్చిన వారు ఎలిమినేట్ అయ్యారా లేదా చెబుతానని నాగ్ చెప్పారు. ఈ ప్రక్రియలో శిల్ప చక్రవర్తి డోర్ ఓపెన్ చేసుకొని హాల్‌లోకి రాగా.. ఆమె ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. దాంతో పునర్నవి సేఫ్ అయింది.

బాబా భాస్కర్ జోస్యం

బాబా భాస్కర్ జోస్యం

ఎలిమినేషన్ తర్వాత బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి నాగార్జునతో జత కలిసింది. నేను ఇంట్లోకి ప్రవేంచిని రెండు వారాలకే నిష్క్రమించడం బాధగా ఉంది. బాబా భాస్కర్ చెప్పినట్టే నేను వారానికే బయటకు వచ్చాను. ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి నేను బయటకు వెళ్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్టే నేను ఎలిమినేట్ అయ్యాను అని శిల్ప చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X