సైగలు చేసి కష్టాల్లో పడ్డ హిమజ.. సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్న నెటిజన్లు

కంటెస్టెంట్ల మధ్యే కాదు.. వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కూడా బిగ్ బాస్ సెగ రగిల్చాడు. హౌస్లోకి వచ్చి అరవై రోజులైన సందర్భంగా కంటెస్టెంట్ల కు వారి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఊరికే ఎలాంటి ట్విస్ట్ లేకుండా ఇస్తే కిక్కేమ్ ఉంటుందని అనుకున్నాడేమో.. వాళ్ళతో కూడా ఓ ఆట ఆడించాడు...

కొందరికే కలిసొచ్చిన అదృష్టం..

కొందరికే కలిసొచ్చిన అదృష్టం..

పది మందిని చూడటానికి వారి వారి తరుపున పది మంది హౌస్ లోకి వచ్చారు. అయితే అందరూ అందర్నీ కలవలేకపోయారు. వచ్చిన పది మందికి ఓ పది బాక్స్ లను సెలెక్ట్ చేస్కోమన్నాడు. వాటిలో బిగ్ బాస్ కన్ను బొమ్మ వస్తే కలిసే అవకాశం ఇస్తానని , జోకర్ బొమ్మ వస్తే అక్కడి నుంచే ఏదైనా మాట్లాడి వెళ్లిపోవాలని కండీషన్ పెట్టాడు. దీoతో పన్ను, వితిక, శివ జ్యోతి, హిమజ, రవి కుటుంబీకులకు మాత్రమే కన్ను బొమ్మ వచ్చింది.

రెండో లెవెల్ గేమ్ ఆడించిన బిగ్ బాస్

రెండో లెవెల్ గేమ్ ఆడించిన బిగ్ బాస్

అయితే మొదటి ఘట్టాన్ని పూర్తి చేసుకున్న హిమజ ఫ్రెండ్ రోజా, రవి మామ శ్రీనివాస్, వితిక , శివ జ్యోతి, పన్ను సోదరులకు మరో టాస్క్ ఇచ్చాడు. వాళ్లంతా టాప్2 కంటెస్టెంట్ల లో ఉండబోయే, ఉండాల్సిన హౌస్ మేట్ గురించి చర్చించాలని, ఒక ముప్పై నిమిషాల సమయాన్ని గడవుగా ఇచ్చారు. ఇక వారి మధ్యా వార్ మొదలైంది.

Recommended Video

Bigg Boss Telugu 3 : Bigg Boss 3 Telugu Contestants Remunerations
ఆమె ఎందుకు వచ్చిందంటూ సెటైర్లు..

ఆమె ఎందుకు వచ్చిందంటూ సెటైర్లు..

హిమజకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ఆమె స్నేహితురాలు రోజాపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఆమె హిమజకు సపోర్ట్ చేయకుండా వరుణ్ను ఎందుకు హైలెట్ చేస్తోంది? ఆమె వచ్చింది ఎందుకు? వచ్చి వరుణ్ కు బూస్టప్ ఇచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా హిమజ కోసం బాగానే ఫైట్ చేసి మాట్లాడిందoటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

క్లాప్స్ కొట్టడంతో.. రచ్చ రచ్చ..

క్లాప్స్ కొట్టడంతో.. రచ్చ రచ్చ..

శివ జ్యోతి సోదరుడు ఏదో పాయింట్ మాట్లాడుతున్న సమయంలో.. హిమజ లేసి చప్పట్లు కొట్టింది. అయితే ఇంటి సభ్యులు ప్రశ్నించడంతో.. ఆ పాయింట్లు నాకు నచ్చాయి.. నేను క్లాప్స్ కొట్టిన అంటూ తన స్టయిల్లో సమాధానం చెప్పింది. ఇక ఈ విషయమై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై హిమజ ఫాలోవర్స్ ఆమెకు సపోర్టుగా నిలుస్తుండగా.. ట్రోల్స్ చేసేవారు చేస్తూనే ఉన్నారు.

గతంలోనూ ఇలానే చేసిందoటూ...

గతంలోనూ ఇలానే చేసిందoటూ...

గతంలో ఓ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఏదో మాట్లాడుతూ ఉంటే.. లేచి క్లాప్ కొట్టింది. ఇదే తనకు దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. అందరితో కలవకుండా, తన మానాన తాను ఏదో ఉండిపోతుంది. ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ వారం హిమజ వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఎవరు వెళ్తారన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X