బిగ్ బాస్ 3: తన భార్య అతడితో...వరుణ్ సందేశ్‌ తట్టుకోలేక పోతున్నాడా?

Recommended Video

Bigg Boss Telugu 3 : Mahesh Vitta Strong Punch To Hema || Latest Promo || Filmibeat Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రియాల్టీ షో ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. హౌస్‌లో ఏ క్షణంలో ఏం జరుతుందో, ఎవరి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో ముందుగా పసిగట్టలేని విధంగా బిగ్ బాస్ ఆసక్తికర టాస్కులు ఇస్తున్నాడు.

గురువారం(జులై 25) రాత్రి ప్రసారం అయ్యే షోకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో చూపించిన సీన్లు షోపై మరింత ఆసక్తి పెంచాయి. ఏ విషయాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా ఉత్కంఠ రేకెత్తించే ప్రయత్నం చేశారు.

తన భార్య అతడితో...వరుణ్ సందేశ్‌ తట్టుకోలేక పోతున్నాడా?

తన భార్య అతడితో...వరుణ్ సందేశ్‌ తట్టుకోలేక పోతున్నాడా?

తాజాగా విడుదలైన ప్రోమోలో.... అలీ రెజా, వితికా జట్టుకట్టి ఇంట్లో ఏదో పనులు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య దూరి వరుణ్ సందేశ్ గొడవ చేయడం మొదలు పెట్టాడు. మీ ఇద్దరికీ సెట్ కాదు అంటూ వరుణ్ సందేశ్ సూచించగా.... నేను మీ డైరెక్షన్ అడిగానా? మీరు మా పనిలో ఇన్వాల్వ్ అవ్వొద్దు అంటూ అలీ రెజా విసుక్కోవడం గమనార్హం. మరి వీరి మధ్య ఈ వాదనకు కారణం ఏమిటో రాత్రి 9.30 గంటలకు ప్రసారం అయ్యే షోలో ఓ క్లారిటీ రానుంది.

రాహుల్, జాఫర్, హేమ

రాహుల్, జాఫర్, హేమ

మరో సీన్లో ‘కరెక్టుగా వచ్చేదాకా నేను వదిలి పెట్టను' అని సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చెప్పడం... ‘దీనికి ఒక పులిస్టాప్ పెట్టాలంటే మీరే దీనికి ఆన్సర్ చేస్తే బావుంటుంది' అని జాఫర్ హేమకు సూచించడం, ‘మీరంతా టెన్షన్ పడకండి, రేపు నాగార్జున గారు' వస్తారు అని హేమ సమాధానం ఇవ్వడం బట్టి చూస్తే ఇంటి సభ్యుల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.

నాగార్జున లెవల్ ఏమిటి? మన పత్తాపారం ఏమిటి?

నాగార్జున లెవల్ ఏమిటి? మన పత్తాపారం ఏమిటి?

హేమ.. నాగార్జున ప్రస్తావన తేవడంతో... మహేష్ విట్టా తనదైన శైలిలో పంచ్ వేశాడు. నాగార్జున లెవల్ ఏమిటి మన పత్తాపారం (పత్తి వ్యాపారం) ఏమిటి? అంటూ డైలాగ్ పేల్చడం, వెంటనే హేమకు చెంపపెట్టు లాంటి బ్యాగ్రౌండ్ సౌండ్ వేసి ప్రోమో ఆసక్తికరంగా కట్ చేశారు.

బిగ్ బాస్ సీజన్ 3

బిగ్ బాస్ షో చుట్టూ పలు వివాదాలు ముసుకున్నప్పటికీ ఎలాంటి ఆటంకం లేకుండా ఆదివారం(జులై 21) ఈ షో ప్రారంభం అయింది. కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X