Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
అఫీషియల్: ‘బిగ్ బాస్ తెలుగు 3’ ప్రోమో వచ్చేసింది!
తెలుగు టెలివిజన్ రంగంలో 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 2017లో ప్రారంభం అవ్వగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ దూసుకెళ్లింది.
షూటింగ్స్ బిజీ వల్ల రెండో సీజన్లో ఎన్టీఆర్ కొనసాగలేక పోయారు. దీంతో 2018లో రెండో సీజన్ నాని హోస్ట్‌గా ప్రారంభం అయింది. మొదటి సీజన్ స్థాయిలో కాకపోయినా రెండో సీజన్ కూడా సూపర్ హిట్ షోగా నిలిచింది. త్వరలో మూడో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు 'స్టార్ మా' సంస్థ అఫీషియల్ ప్రోమో విడుదల చేసింది.
ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇది ముగిసిన తర్వాత 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 3 మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 21 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. మూడో సీజన్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
#BiggBossTelugu3..Coming Soon On @StarMaa pic.twitter.com/XX3ImEBS8C
— STAR MAA (@StarMaa) June 15, 2019
ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు? అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సారి సెలబ్రిటీలను మాత్రమే ఎంపిక చేస్తున్నారని, కామన్ మ్యాన్‌కు అవకాశం లేదని టాక్. సినీ, టీవీ రంగం నుంచి మంచి ఫేస్ వ్యాల్యూ ఉన్న వారిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పటాస్ షో యాంకర్ శ్రీముఖితో పాటు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
గత సీజన్లో కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిలిచారు. షో మొదలైన మొదటి వారంలోనే కౌశల్ ఆర్మీ పేరుతో ఒక గ్రూఫ్ ఏర్పడటం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం, హోస్ట్ నానితో పాటు ఇతర కంటెస్టెంట్లను ఇబ్బందులకు గురి చేయడం తెలిసిందే. ఇది పేయిడ్ ఆర్మీ అని, కౌశల్ భార్యతో పాటు మరికొందరు దీని వెనక ఉండి నడిపించినట్లు ఆరోపణలు వినిపించాయి.