For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అఫీషియల్: ‘బిగ్ బాస్ తెలుగు 3’ ప్రోమో వచ్చేసింది!

|

తెలుగు టెలివిజన్ రంగంలో 'బిగ్ బాస్' రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 2017లో ప్రారంభం అవ్వగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తూ దూసుకెళ్లింది.

షూటింగ్స్ బిజీ వల్ల రెండో సీజన్లో ఎన్టీఆర్ కొనసాగలేక పోయారు. దీంతో 2018లో రెండో సీజన్ నాని హోస్ట్‌గా ప్రారంభం అయింది. మొదటి సీజన్ స్థాయిలో కాకపోయినా రెండో సీజన్ కూడా సూపర్ హిట్ షోగా నిలిచింది. త్వరలో మూడో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు 'స్టార్ మా' సంస్థ అఫీషియల్ ప్రోమో విడుదల చేసింది.

Bigg Boss Telugu 3 official promo released

ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇది ముగిసిన తర్వాత 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 3 మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై 21 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. మూడో సీజన్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరు? అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సారి సెలబ్రిటీలను మాత్రమే ఎంపిక చేస్తున్నారని, కామన్ మ్యాన్‌కు అవకాశం లేదని టాక్. సినీ, టీవీ రంగం నుంచి మంచి ఫేస్ వ్యాల్యూ ఉన్న వారిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పటాస్ షో యాంకర్ శ్రీముఖితో పాటు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.

గత సీజన్లో కౌశల్ బిగ్ బాస్ విజేతగా నిలిచారు. షో మొదలైన మొదటి వారంలోనే కౌశల్ ఆర్మీ పేరుతో ఒక గ్రూఫ్ ఏర్పడటం, సోషల్ మీడియాలో రచ్చ చేయడం, హోస్ట్ నానితో పాటు ఇతర కంటెస్టెంట్లను ఇబ్బందులకు గురి చేయడం తెలిసిందే. ఇది పేయిడ్ ఆర్మీ అని, కౌశల్ భార్యతో పాటు మరికొందరు దీని వెనక ఉండి నడిపించినట్లు ఆరోపణలు వినిపించాయి.

English summary
Bigg Boss Telugu 3 official promo released. Social media buzz is that, this year we will see Akkineni Nagarjuna as the host of the show. Bigg Boss 3 will reportedly be restricted to celebrities alone this season. Source said that, The show will tentatively be launched on July 21.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more