బిగ్ బాస్ తెలుగు 3: హోస్ట్ చేసేది ఆయనే, ప్రోమోస్ చిత్రీకరిస్తున్నారు
బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ 2017లో మొదలవ్వగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. అప్పటి వరకు తెలుగు వారికి పరిచయం లేని కొత్త తరహా షో కావడం, ఆడియన్స్ ఆసక్తికి ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ తోడవ్వడంతో హయ్యెస్ట్ రేటింగ్స్ సాధించి సంచలనం క్రియేట్ చేసింది.
సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్ల యంగ్ టైగర్ రెండో సీజన్ హోస్ట్ చేయలేక పోయారు. దీంతో నిర్వాహకులు నేచురల్ స్టార్ నానిని రంగంలోకి దింపారు. ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా తనదైన శైలిలో బిగ్ బాస్ 2ను రక్తికట్టించాడు. నాని కూడా సినిమా షూటింగ్స్ బిజీ వల్ల మూడో సీజన్ హోస్ట్ చేయడానికి ముందుకు రాలేదు.

మూడో సీజన్ హోస్ట్ చేసేది ఎవరు? అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈసారి షోను హోస్ట్ చేసేది అక్కినేని నాగార్జున అనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. గతంలో నాగార్జున 'మీలో ఎవరు కోటీశ్వరుడు'ను విజయవంతంగా చేసిన నేపథ్యంలో బిగ్ బాస్ మూడో సీజన్‌కు ఆయన్నే ఎంపిక చేశారట.
ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా మరో న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం నాగ్... 'బిగ్ బాస్ తెలుగు 3' ప్రోమో చితీకరణలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమో విడుదల చేయడం ద్వారా ఈ షోను హోస్ట్ చేసేది నాగార్జున అనే విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించబోతున్నారట.
'బిగ్ బాస్ తెలుగు 3'కి సంబంధించిన అఫీషియల్ లోగో ఇటీవలే విడుదల చేశారు. ప్రారంభం అయ్యేది ఎప్పుడనే విషయం మాత్రం బయట పెట్టలేదు. జూలై 21 నుంచి మొదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నాగార్జునను హోస్ట్‌గా అనౌన్స్ చేసిన తర్వాత ప్రారంభ తేదీతో పాటు ఎన్ని రోజుల పాటు ఈషో సాగుతుందనే విషయం వెల్లడించనున్నారట.


Click it and Unblock the Notifications











