twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 3... కంటెస్టెంట్లు వీరేనా?

    |

    బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మూడో సీజన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది. ఈ షో చుట్టూ పలు వివాదాలు ముసురుకున్నప్పటికీ... అవేవీ దీన్ని ఆపలేకపోయాయి.

    మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ షో ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో ఇందులో ఈ సారి కంటెస్టెంట్లుగా ఎవరు పోటీ చేయబోతున్నారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 మంది పోటీదారులతో 100 రోజుల పాటు ఈ రియాల్టీషో సాగనుంది.

    తొలి రెండు సీజన్లు గ్రాండ్ సక్సెస్

    తొలి రెండు సీజన్లు గ్రాండ్ సక్సెస్

    బిగ్ బాస్ తొలి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సూపర్ హిట్ అయింది. మొదటి సీజన్లో శివ బాలాజీ విజేతగా నిలిచాడు.... నాని హోస్ట్ చేసిన రెండో సీజన్లో కౌశల్ విన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి నాగార్జున రంగంలోకి దిగడంతో షో ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

    కంటెస్టెంట్ల ఎంపిక

    కంటెస్టెంట్ల ఎంపిక

    గత కొన్ని నెలల ముందు నుంచే కంటెస్టెంట్ల ఎంపిక ప్రకియ మొదలైంది. ఇందుకోసం నిర్వాహకులు సినిమా, టీవీ రంగాలకు చెందిన దాదాపు 200 మంది సెలబ్రిటీలను సంప్రదించినట్లు సమాచారం. వీరిలో నుంచి 15 మందిని ఫైనలైజ్ చేశారు.

    ఈ సారి కంటెస్టెంట్లు వీరేనా?

    ఈ సారి కంటెస్టెంట్లు వీరేనా?

    ఈ సారి కంటెస్టెంట్ల లిస్టులో వరుణ్ సందేశ్, అతడి భార్య వితిక షేరు, టీవీ 9 రిపోర్టర్ జాఫర్, నటి హేమ, యాంకర్ శ్రీముఖి, వి6 ఛానల్ యాంకర్ సావిత్రి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మిగతావారు ఎవరు? అనేది ఆదివారం సాయంత్రానికల్లా తేలిపోనుంది.

    బిగ్ బాస్ 3

    బిగ్ బాస్ 3

    వాస్తవానికి ‘బిగ్ బాస్ తెలుగు 3' జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే హోస్ట్‌ నాగార్జున సినిమా షూటింగులో బిజీగా ఉండటంతో పాటు కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. నాగార్జున వల్ల ఈ షోకు మరింత గ్లామర్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Bigg Boss Telugu 3, which will start broadcasting on Star Maa from Sunday, July 21. Host Akkineni Nagarjuna introduce 15 contestants of the much-awaited reality TV show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X