అక్కా నువ్వు తోపు హేమను ఆటాడుకొని.. హాట్ హాట్‌గా తమన్నా.. లవ్‌బర్డ్స్‌గా ఆ నలుగురు
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో చివరి ఘట్టానికి చేరుకొన్నది. ఇంటి సభ్యుల్లోని 5 గురు టాప్ కంటెస్టెంట్లలో విజేత ఎవరనే ఉత్కంఠ పెరిగిపోతున్నది. ఈ క్రమంలో ఈ సీజన్‌లో పాల్గొన్న అందరు సభ్యులను ఒకచోట కలిపారు. దాంతో ఇంట్లో అందరూ కలవడంతో ఇళ్లంతా పండగ వాతావరణం నెలకొన్నది. ఇక ఇంటి సభ్యులందరూ ఒకరికొకరు కామెంట్లు విసురుకొంటూ ఆనందంగా గడిపారు. ఇంట్లోని విశేషాలు ఏమిటంటే..

తమన్నా సింహాద్రి హాట్‌గా
ప్రస్తుత సీజన్‌లోని సభ్యులందరూ విడుతల వారీగా ఇంట్లోకి ప్రవేశించారు. అలా ప్రవేశించిన వారిలో తమన్నా సింహాద్రి చాలా హాట్‌గా కనించారు. హాఫ్ మిడ్డీతో చాలా గ్లామరస్‌గా కనిపించారు. అందరిని కౌగిలింతలతో ముంచెత్తుతూ హ్యాపీ మూడ్‌లో కనిపించారు. రవికృష్ణతో విభేదాలు మరిచి ఆనందంగా మాట్లాడుతూ కనిపించింది. గతంలోనివి ఏవీ మనసులో పెట్టుకోవద్దు అంటూ తమన్నా చెప్పడం కనిపించింది.

అల్లరితో హేమ హంగామా
ఇక ఇంట్లోకి రాగానే హేమ అల్లరి మర్మోగింది. హేమ రాగానే అప్పటి వరకు కామ్‌గా ఉంటే.. ఆమె రాకతో గందరగోళంగా మారిపోయింది. హేమ నీవు తోపు అక్కా అంటూ ఇంటి సభ్యులు ఆటపట్టించారు. ఇక వద్దురా అలా అని నన్ను బయటకు పంపించారు. నేను అది తెలుసుకోలేక నిజంగా తోపునే అనుకొన్నాను అని హేమ అనడం కనిపించింది.

బాబ, మహేష్, జాఫర్ కలయికతో
ఇక బాబా భాస్కర్, మహేష్ విట్ట, జాఫర్ కలయిక ఫీల్‌గుడ్ ఫ్యాకర్ట్‌ను క్రియేట్ చేసింది. మహేష్ విట్టా ఇంట్లోకి రాగానే బాబా తనకు లభించిన బిగ్‌బాస్ ఫినాలె టికెట్‌ను చూపించి సంతోషంలో మునిగిపోయారు. జాఫర్, బాబా మనసు విప్పి మాట్లాడుకొన్నారు. జాఫర్ పిచ్చిపాట పాడితే బాబా భరత నాట్యం చేసి ఆకట్టుకొన్నాడు.

లవ్‌బర్డ్స్‌గా వితిక, వరుణ్, పునర్నవి, రాహుల్
ఇక వితిక, వరుణ్ సందేశ్, అలాగే పునర్నవి, రాహుల్ జంట ప్రత్యేక ఆకర్షణగా మారారు. ప్రేమ పక్షులుగా మారి కౌగిలింతల్లో మునిగిపోయారు. ఎలా ఉన్నావంటూ పరస్పరం పలకరించుకొన్నారు. బామ్మ వీడియో వైరల్ అయిందటగా అంటూ వరుణ్ కనిపించాడు. ఇక నీకు కొత్త ఫ్రెండ్ దొరికిందిగా అంటూ రాహుల్‌ను పునర్నవి దెప్పి పొడిచింది. తన వస్తువులను దాచుకోవడంపై ఆమె ఆరా తీసింది.


Click it and Unblock the Notifications











