twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌లో జగడం.. నన్ను అలా అంటే ఒక్కొక్కడిది పగులగొడుతా.. మహేష్ విట్ట వార్నింగ్

    |

    Recommended Video

    Bigg Boss Telugu 3: Episode 31 Highlights | నన్ను అలా అంటే ఒక్కొక్కడిది పగులగొడుతా..మహేష్ వార్నింగ్!

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 29, 30వ రోజు రంజుగా సాగాయి. కాసేపు కోపతాపాలతో, మరికొంత సేపు వినోదంతో ఇల్లు కళకళలాడింది. ఇంటిలో చాలా రకాల భావోద్వేగాలు వేదికపై కనిపించాయి. అంతేకాకుండా కెప్టెన్సీ టాస్క్‌లో వితిక, శివజ్యోతి పోటీ పడ్డారు. అలాగే వరుణ్ సందేశ్, వితిక పెళ్లి రోజును ఇంటి సభ్యులు ఘనంగా నిర్వహించారు. వారిని ఆశీర్వదించి దీవించారు. ఇంటిలో 30వ రోజు హైలెట్స్ ఏమిటంటే..

    అలీ నామినేట్ చేయడంపై

    అలీ నామినేట్ చేయడంపై

    ప్రస్తుత వారంలో ఏ కారణం లేకుండా తనను కెప్టెన్ అలీ నామినేట్ చేయడంపై కంటతడి పెట్టిన బాబా భాస్కర్ ఆ బాధ నుంచి తేరుకొని వంటగదిలోకి వెళ్లాడు. నూనె విపరీతంగా వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలా వాడితే నూనె సరిపోదు. ఇంకా రెండు బాటిల్స్ మాత్రమే ఉన్నాయి అని బాబా భాస్కర్ ఇంటి సభ్యులకు హెచ్చరించారు. మటన్ వండే పనిలో ఇంటి సభ్యులు ఉన్నారు.

    శ్రీముఖి చర్చ లేవనెత్తి

    శ్రీముఖి చర్చ లేవనెత్తి

    ఇక బాబా భాస్కర్ కంటతడి పెట్టడం ఇంటి సభ్యుల మధ్య భారీ చర్చకు దారి తీసింది. తాను ఎందుకు బాబాను నామినేట్ చేశాననే విషయంపై వివరణ ఇవ్వడానికి కెప్టెన్ అలీ సిద్ధమయ్యాడు. బాబా భాస్కర్ బాధపడిన విషయాన్ని శ్రీముఖి ఇంటి సభ్యులతో ముచ్చటించింది. బాబాతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అలికి సూచించింది.

    మహేష్ విట్ట వర్సెస్ అలీ

    మహేష్ విట్ట వర్సెస్ అలీ

    బాబా భాస్కర్‌కు అలీ వివరణ ఇస్తుండగా మధ్యలో ఏదో చెప్పడానికి మహేష్ విట్టా వెళ్లాడు. అయితే తాను సముదాయిస్తుంటే మధ్యలో దూరి పుల్లలు పెట్టకు అని అలీ అరవడంతో ఇంట్లో గొడవ మొదలైంది. అలీ తీరుతో మహేష్ చిన్నబుచ్చుకొన్నాడు. ఓ దశలో మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కారణం లేకుండా పుల్లలు పెడుతానంటే పగలకొడుతాను అంటూ మహేష్ ఫైర్ అయ్యాడు.

    శ్రీముఖి, శివజ్యోతి ర్యాగింగ్

    శ్రీముఖి, శివజ్యోతి ర్యాగింగ్

    ఇలాంటి సీరియస్ సన్నివేశాల మధ్య శ్రీముఖి, శివజ్యోతి ర్యాంగింగ్ ఎపిసోడ్‌తో వినోదాన్ని పంచారు. పునర్నవి, వితికను ర్యాంగింగ్ చేస్తూ పాటలు పాడమన్నారు. జయం సినిమాలోని గాజువాక పిల్ల పాటను పాడి వినిపించారు. వారిని పేర్లు చెప్పమనగా సావిత్రి, వాణిశ్రీ అంటూ బదులు ఇచ్చారు. మళ్లీ డ్యాన్స్ చేయమనగా ఇస్మార్ట్ శంకర్ పాటకు స్టెప్పులేస్తే.. సావిత్రి డ్యాన్స్ లాగా లేదు.. సన్నీ డ్యాన్స్‌లా ఉందంటూ శ్రీముఖి టీజ్ చేశారు.

    ఘనంగా వితిక, వరుణ్ పెళ్లిరోజు

    ఘనంగా వితిక, వరుణ్ పెళ్లిరోజు

    బిగ్‌బాస్ ఇంటిలోకి దంపతులుగా ప్రవేశించిన వరుణ్ సందేశ్, వితికకు మంగళవారం పెళ్లిరోజు. దాంతో ఇంటి సభ్యులందరూ కలిసి వారికి పెళ్లితంతును నిర్వహించారు. వరుణ్, వితిక దండలు మార్చుకొని ముద్దులు పెట్టుకొని ప్రేమను పంచుకొన్నారు. వారిద్దరిని ఇంటి సభ్యులందరూ ఆశీర్వదించారు. దాంతో వారి పెళ్లి రోజు బిగ్ బాస్ సెలబ్రిటీల మధ్య గడిచిపోయింది.

    English summary
    Bigg Boss 3 season started with Nagarjuna as host. On day one, Shock for Sreemukhi, Baba Bhaskar. These along with some other celebraties nominated for elimination.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X