బిగ్‌బాస్ ఇంటి కెప్టెన్‌గా శివజ్యోతి.. కఠినమైన పరీక్షలో వితిక బేజారు

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 29, 30వ రోజు రంజుగా సాగాయి. కాసేపు కోపతాపాలతో, మరికొంత సేపు వినోదంతో ఇల్లు కళకళలాడింది. ఇంటిలో చాలా రకాల భావోద్వేగాలు వేదికపై కనిపించాయి. అలాగే వరుణ్ సందేశ్, వితిక పెళ్లి రోజును ఇంటి సభ్యులు ఘనంగా నిర్వహించారు. వారిని ఆశీర్వదించి దీవించారు. అంతేకాకుండా కెప్టెన్సీ టాస్క్‌లో వితిక, శివజ్యోతి పోటీ పడ్డారు. ఇంటిలో 30వ రోజు కెప్టెన్సీ హైలెట్స్ ఏమిటంటే..

 Bigg Boss Telugu 3 season: Siva Jyothy is new captain

తదుపరి వారానికి సంబంధించిన ఇంటి కెప్టెన్సీ ఎన్నిక కోసం బిగ్ బాస్ నీదా పంతం.. నాదా పంతం అనే పోటీని నిర్వహించాడు. కెప్టెన్సీ టాస్క్ కోసం ముందు ఓ పోటీని నిర్వహించి ఇద్దరిని ఎంపిక చేయాలని నిర్ణయించాడు. ఇంటిలో బెల్ మోగగానే కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి .. అక్కడ ఉన్న సీటుపై ఎవరైతే ఇద్దరు ముందుగా కూర్చుని ఉంటారో వారు కెప్టెన్సీ కోసం పోటీ పడుతారని గేమ్ నిబంధన తెలిపారు. అలా నిర్వహించిన పోటీలో శివజ్యోతి, వితిక గెలిచారు.

Siva Jyothy is new captain

కెప్టెన్సీ పదవి కోసం నిర్వహించిన టాస్క్‌లో వితిక, శివజ్యోతి పాల్గొన్నారు. ఇంటిలో ఓ క్రేన్స్‌కు వేలాడ దీసిన వైర్స్‌కు శివజ్యోతి, వితికను బంధించి పైన వేలాడదీశాడు. ఎక్కువ సేపు ఎవరైతే వేలాడుతూ ఉంటారో వారు ఇంటి కెప్టెన్‌గా ఎన్నికవుతారు. ఈ పోటీ నుంచి వితిక బాడీ నొప్పుల కారణంగా తప్పుకోవడంతో శివజ్యోతి కెప్టెన్‌గా ఎంపికైంది. తాను కెప్టెన్‌గా ఎంపిక కావడానికి సహకరించిన వారందరితో తన ఆనందాన్ని పంచుకొన్నది. దీంతో వచ్చేవారం కూడా శివజ్యోతి నామినేషన్ కాకుండా తప్పించుకొన్నట్లయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X