Don't Miss!
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. పక్కా ప్రూఫ్.. వైరల్ పిక్
బిగ్ బాస్ సీజన్ 3 ముగింపుకు సమయం ఆసన్నమైంది. నాగార్జున హోస్ట్‌గా ఇన్నిరోజుల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ షో ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కానున్నారని దానిపై జనాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగానే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్‌ని హత్తుకొని నాగార్జున ప్రశంసిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతుండటం హాట్ ఇష్యూగా మారింది. వివరాల్లోకి పోతే..
చివరి వారం.. హౌస్‌లో ఐదుగురు
ఇటీవలే పద్నాలుగో వారం పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం చివరి వారంలో చేరిపోయింది. ఈ వారం ముగిసేసరికి బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఐదుగురు కంటిస్టెంట్స్ ఉన్నారు. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్ లు ఫైనల్ రేస్‌లో బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు.
శ్రీముఖి, రాహుల్‌పై ఎక్కువ ఫోకస్
ఈ ఐదుగురు కంటిస్టెంట్లలో శ్రీముఖి, రాహుల్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ ఇద్దరికే ఎక్కవ ఓట్లు పడ్డాయని అంటున్నారు. శ్రీముఖి, రాహుల్ లలో ఎవరో ఒకరు ఖచ్చితంగా విన్ అవుతారని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరికీ పలువురు సెలెబ్రిటీలు కూడా సపోర్ట్ చేస్తుండటంతో ఫైనల్ కాంటెస్ట్ ఈ ఇద్దరి నడుమే ఉందని ఫిక్స్ అయ్యారంతా.
సోషల్ మీడియాలో వైరల్ పిక్.. షాకవుతున్న నెటిజన్స్
ఇంతలో సోషల్ మీడియాలో ఓ ఫోటో ప్రత్యక్షం కావడం, ఆ ఫోటో చూస్తూనే బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది క్లియర్‌గా తెలుస్తుండటం నెటిజన్లకు షాకిస్తోంది. ఈ పిక్ చూస్తుంటే.. శ్రీముఖిని హత్తుకున్న బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఆమెకు బిగ్ బాస్ టైటిల్ అందజేసినట్లుగా తెలుస్తోంది. పైగా ఈ పిక్ షేర్ చేస్తూ, తెలుగు బిగ్ బాస్‌లో తొలి మహిళా విజేత అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు వ్యక్తులు.
ఇంతకీ నిజమేనా? పక్కా ప్రూఫ్
ఈ పిక్ ద్వారా బిగ్ బాస్ విన్నర్ శ్రీముఖి అని పక్కాగా చెబుతున్నారు. అయితే ఇంతకీ ఇది నిజమేనా? లేక ఎవరైనా మార్ఫింగ్ చేసి దీన్ని సృష్టించారా? అనేది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఈ పిక్ చూసి జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. శ్రీముఖికి కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. చూడాలి మరి ఈ ఆదివారం అసలు విజేత ఎవరవుతారనేది!.