బిగ్‌బాస్‌కు ఆ సెలబ్రీటీలు వేస్ట్.. తమన్నా సెన్సేషన్.. బాబా భాస్కర్ కడుపున పుట్టి ఉంటే అంటూ..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 షోలో మూడో వారం ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డు ఎంట్రీతో ప్రవేశించి, ఇంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో హడావిడి చేసిన తమన్నా అర్ధాంతరంగా నిష్క్రమించింది. ఎలిమినేషన్ తర్వాత వేదికపైకి చేరుకొని నాగార్జునతో హల్‌చల్ చేశారు. తమన్నాతో కలిసి ఇంటి సభ్యులతో ఓ గేమ్ ఆడించారు. ఆ గేమ్‌లో భాగంగా.. ఇంటి సభ్యుల గురించి తమన్నా ఏదైనా మాట్లాడవచ్చని చెప్పారు.. ఇంతకు తమన్నా ఏం మాట్లాడారంటే..

నాగార్జున నోటి నుంచి ఆ మాట

నాగార్జున నోటి నుంచి ఆ మాట

బిగ్‌బాస్ హౌస్‌లోకి రావడం నా డ్రీమ్. నా కల నెరవేరింది. తమన్నా.. తమన్నా అంటూ నాగార్జున నోటి నుంచి రావడంతో నా జన్మధన్యమైంది. నా ఉద్దేశం కోసం వెళ్లాను. అది నెరవేర్చే ప్రయత్నం చేశాం. నాకు ఓ భ్రమ తొలిగిపొయింది. బిగ్‌బాస్ ఓ స్క్రిప్టెడ్ అనుకొంటారు. కానీ అదంతా తప్పు. నేను మానసికంగా ధృడంగా ఉంటాను. అలాంటి నేనే ఎమోషనల్ అయ్యాను. చాలాసార్లు ఏడ్చాను అని తమన్నా తెలిపారు. బిగ్‌బాస్‌లో అవకాశం కల్పించిన స్టార్ మాకు రుణపడి ఉంటానన్నారు. ఆ తర్వాత బిగ్ బాడాస్ గేమ్‌ను ప్రారంభించారు. ఇంట్లోని వ్యక్తి ఫొటోలు చూసిస్తే వారి గురించి ఇష్టం వచ్చింది చెప్పవచ్చన్నారు.

 శ్రీముఖి ఆడపులి అంటూ

శ్రీముఖి ఆడపులి అంటూ

వరుణ్ సందేశ్ గురించి మాట్లాడుతూ.. ఓ హీరో అయినప్పటికీ.. కానీ ఆయన స్వయంగా స్టాండ్ తీసుకోలేకపోవడం చూశాను. ఇతరుల మాటలతో ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. అదే నాకు నచ్చలేదు అని తమన్నా తెలిపింది. ఆ తర్వాత శ్రీముఖి గురించి మాట్లాడుతూ.. ఆడపులి అంటూ ప్రశంసించింది. మంచి వ్యక్తి, మంచి ఆలోచనలు కలిగిన మనిషి. సూపర్ లేడి అంటూ చెప్పింది.

 చెడుగానే ఆలోచిస్తారని

చెడుగానే ఆలోచిస్తారని

శివజ్యోతి గురించి మాట్లాడుతూ.. మంచి చెప్పిన చెడు చెప్పినా చెడుగానే తీసుకొంటారు. అక్కడ ఏదో చూపించాలని తాపత్రయ పడుతుంది. కానీ ఆమె ఆ విషయంలో సఫలం కాలేదు. ఆమె ఎలా ఉందో అలా ఉండాలని కోరుకొంటున్నాను అని చెప్పింది. గతంలో జర్నలిజం గురించి వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

 అలాంటి బిగ్‌బాస్‌కు వేస్ట్

అలాంటి బిగ్‌బాస్‌కు వేస్ట్

రోహిణి గురించి.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎందుకు వచ్చామో అనే విషయం ఆమెకు తెలియదు. బయట ఫ్రెండ్‌షిప్ ఇంట్లో కూడా కొనసాగిస్తున్నది. తిన్నామా? పడుకొన్నామా? అనేది తప్ప మరోటి లేదు. ఇలాంటి క్యాండిడేట్లు బిగ్‌బాస్‌కు వేస్ట్ అని తమన్నా చెప్పింది. తమన్నా మాటలకు రోహిణి థ్యాంక్స్ చెప్పింది.

 నా పండు పప్పులా మారారని

నా పండు పప్పులా మారారని

రవికృష్ణ గురించి మాట్లాడుతూ.. ఈ రోజుల్లో 15 సంవత్సరాల పిల్లాడు కూడా స్వతంత్రంగా ఉంటాడు. కానీ రవికృష్ణ 30 వయసు వచ్చినా పెద్దగా లాభం లేదు. నా పండు పప్పులా మారడం నాకు నచ్చలేదు. ఆయనకు సపోర్ట్ చేయాలనుకొన్నాను. కానీ వర్కవుట్ కాలేదు. ఇంటిలో నుంచి హీరోగా రావాలనుకొంటున్నాను అని తమన్నా అన్నారు.

రాహుల్ సిప్లిగంజ్ అన్నింటికి కారణం

రాహుల్ సిప్లిగంజ్ అన్నింటికి కారణం

రాహుల్ సింప్లిగంజ్ గురించి మాట్లాడుతూ.. ఆడపిల్లలకు గౌరవం ఇవ్వడం తెలీదు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారనుకొంటా. కానీ బిగ్‌బాస్ హౌస్‌లో ఓ ఆడపిల్లను టార్గెట్ చేస్తూ ఆమె గురించి చెడుగా మాట్లాడటం నచ్చలేదు అని తమన్నా పేర్కొన్నారు. దాంతో ఆడవారికి గౌరవం ఇవ్వాలని రాహుల్‌కు నాగ్ సూచించారు. ఇంట్లో అన్నింటికి నీవే ప్రాబ్లమా? అంటూ నాగ్ చురకలంటించారు. పునర్నవి గురించి మాట్లాడుతూ.. శ్రీముఖి తర్వాత మంచి వ్యక్తి ఎవరైనా ఉందంటే అది పునర్నవి. స్టాండ్ తీసుకోవడంలో ముందుటుంది అని అన్నారు.

బాబా భాస్కర్ కడుపున పుట్టింటే

బాబా భాస్కర్ కడుపున పుట్టింటే

బాబా భాస్కర్ గురించి మాట్లాడుతూ.. నాకు బాబా భాస్కర్ తండ్రి, తల్లి, నా గురువు లాంటి వారు. నాకు అన్నీ ఆయనే అంటూ కంటతడి పెట్టింది. నేను బాబా భాస్కర్‌కే పుట్టి ఉంటే మంచి మహిళను అయి ఉండే దానిని. బాబా భాస్కర్‌ తప్పు జరిగితే రియాక్ట్ అవుతారు అని తమన్నా చెప్పింది. టీవీ సీరియల్‌లో అత్తా కోడళ్ల మాదిరిగా వితిక కారాలు, మిరియాలు రువ్వుతూ చాడీలు చెబుతుంది. కానీ వితికలో మంచి వ్యక్తి ఉన్నారు అని తమన్నా పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X