ఎలిమినేషన్‌ను తట్టుకోలేక భోరున ఏడ్చిన అరియానా.. ఇంటి నుంచి మూడో కంటెస్టెంట్ అవుట్

సండే కావడంతో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 షో మూడో వారాంతం ఫన్ డేగా మారింది. ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో నామినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో టెన్షన్ కనిపించింది. అయితే వీకెండ్ షో ఆటపాటలతో సరదాగా సాగిపోయింది. ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత ఇంటి సభ్యులు భోరున ఏడ్చారు. అఖిల్, మోనాల్, సుజాత, లాస్య అందరూ కంటతడి పెట్టారు. ఇంతకు ఈ వారం ఎవరు గేమ్ నుంచి అవుట్ అయ్యారంటే..

Recommended Video

Bigg Boss Telugu 4 : Devi Nagavalli Re Entry? !ప్రేక్షకుల డిమాండ్!! | Filmibeat Telugu
ఫన్ గేమ్స్‌తో సందడి

ఫన్ గేమ్స్‌తో సందడి

ఇంటిలో ఫన్‌ గేమ్స్ మొదలు పెట్టాలని హోస్ట్ నాగార్జున కొన్ని గేమ్స్ సూచించాడు. అభిజిత్, అమ్మా రాజశేఖర్‌కు రెండు రకాల కలర్ బెలూన్‌లు ఇచ్చి చేతులతో కాకుండా బాడీతో పగలకొట్టాలని సూచించాడు. ఈ గేమ్‌లో అమ్మా రాజశేఖర్ గెలిచాడు. టవర్స్ కట్టే గేమ్‌‌లో దివి, లాస్య ఇద్దరు ఓడిపోయారు. బ్రెడ్స్ తినే గేమ్‌లో సుజాతపై అవినాష్ గెలిచాడు. స్కిప్పింగ్ గేమ్‌లో అఖిల్‌పై మెహబూబ్ గెలిచాడు. ఇలా ఆటల జోష్‌తో సాగాయి. మధ్యలో తొలుత మెహబూబ్‌ను సేఫ్ అయినట్టు ప్రకటించారు.

హారిక సేఫ్ ఇలా..

హారిక సేఫ్ ఇలా..

ఇక సింగిల్ లెగ్‌పై డ్యాన్స్ చేసే గేమ్‌ను ఇంటి సభ్యులతో ఆడిస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు. ఓ పాటను ప్లే చేసి ఫ్రీజ్ అని ఎవరి పేరు చెబితే వారు ఆగిపోవాలి చెప్పి పాటను మొదలుపెట్టారు. పాట మధ్యలో దేత్తడి హారికను ఫ్రీజ్ అనగానే శిల్పంలా నిలిచిపోయింది. హారికను ఎవరైనా డిస్ట్రబ్ చేస్తారా అని అడగా.. అభిజిత్ రంగంలోకి దూకడంతో ఆమె అన్ ఫ్రీజ్ అయ్యారు. దాంతో హారికను ఎలిమినేషన్ నుంచి సేఫ్ చేశారు.

దేవీ నాగవళ్లి ఎలిమినేటెడ్

దేవీ నాగవళ్లి ఎలిమినేటెడ్

ఆ తర్వాత ఓ పాటను ప్లే చేసి తాను చెప్పిన పేరు వ్యక్తి డ్యాన్స్ చేస్తూనే ఉండాలి అని కండిషన్ పెట్టారు. మిర్చి చిత్రంలో పాటను ప్లే చేయగా ఇంటి సభ్యులతోపాటు కొందరు నామినేటెడ్ అయిన వాళ్లు డ్యాన్స్ చేశారు. అరియానా పేరు నాగ్ పలకగానే మిగితా వారు ఆగిపోయారు. అరియానా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆ తర్వాత అరియానాను సేఫ్ అని ప్రకటించారు. ఆ తర్వాత కుమార్ సాయి, దేవీ నాగవళ్లి మిగిలారు. ఆ తర్వాత రెండు బాక్సులు తెప్పించి అందులో రెడ్, గ్రీన్ కలర్స్ ఉంటాయి. ఎవరి డబ్బాలో ఉన్న రెడ్ కలర్ చేతికి అంటుంతుందో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఈ గేమ్‌లో దేవీ నాగవళ్లికి రెడ్ కలర్ అంటడంతో ఎలిమినేటెడ్ అని హెస్ట్ నాగ్ ప్రకటించారు.

దేవీ ఎలిమినేషన్ తట్టుకోలేక ఏడ్చిన అరియానా

దేవీ ఎలిమినేషన్ తట్టుకోలేక ఏడ్చిన అరియానా

దేవీ నాగవళ్లీ ఎలిమినేట్ కావడం తట్టుకోలేక అరియానా భోరున విలపించింది. నేను అవుట్ అయినా బాధపడకపోయేదానిని అంటూ కంటతడి పెట్టింది. ఎందుకంటే ముందు రోజు ఎపిసోడ్‌లో అరియానా, దేవీ ఇద్దరు మాట్లాడుకుంటూ.. ఇద్దరిలో ఎవరైనా ఒకరు బిగ్‌బాస్ విజేతగా నిలువాలి. ఈ సారి విజేత లేడి కంటెస్టెంట్ కావాలి. అది నువ్వైనా లేదా అది నేనైనా కావాలి అంటూ అరియానా, దేవీ మాట్లాడుకొన్నారు. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో ఇంటి సభ్యులతో సెల్ఫీ దిగి బిగ్‌బాస్ వేదికపైకి దేవీ నాగవల్లి చేరుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X