బిగ్ బాస్ 3 వరల్డ్ వైడ్ ట్రెండింగ్... ఆశ్చర్యపోయిన నాగార్జున!

తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఈ సారి కింగ్ నాగార్జున హోస్ట్‌గా రంగంలోకి దిగారు. తొలిరోజు షోలో 15 మంది కంటెస్టెంట్ల పరిచయం, వారిని హౌస్‌లోకి పంపించడంతో షో ముగిసింది. అసలు సిసలన ఆట సోమవారం నుంచి మొదలు కాబోతోంది.

వివాదాల ప్రభావమో? లేక నాగార్జున స్టార్ ఇమేజ్ కారణమో తెలియదు కానీ... ఆదివారం రాత్రి ప్రసారమైన ఈ షోకు అద్భుతమైన స్పందన వచ్చింది. రేటింగ్స్ కూడా అదిరిపోయినట్లు సమాచారం. ట్విట్టర్లో ఈ షో వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లిస్టులో చోటు దక్కించుకుందంటే రెస్పాన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న రాత్రి ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 3 వరల్డ్ వైడ్ ట్రెడింగులోకి రావడంతో సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. మున్ముందు ఈ షోకు అద్భుతమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

 Bigg Boss telugu 3 trending no 1 world wide last night

ఈషోలో కంటెస్టెంట్లుగా వి6 సావిత్రి(శివజ్యోతి), రవికృష్ణ, అషురెడ్డి, జాఫర్, హిమజ, రాహుల్ సిప్లిగంజ్, రోహిణి, బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, హేమ, అలీరెజా, మహేష్ విట్టా, శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షేరు ఎంటరయ్యారు.

కాగా... సోమవారం నుంచి ఎలిమినేషన్ నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. తొలివారం నామినేషన్ల లిస్టులో జాఫర్, శ్రీముఖి, వరుణ్ సందేశ్ లాంటివారు ఉండటం విశేషం. సోమవారం నుంచి ఈ షో మరింత రసవత్తరంగా సాగుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X