Don't Miss!
- Sports రాయల్ ఛాలెంజర్స్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్
- News మాళవ్య రాజయోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
- Lifestyle శ్రీరామనవమికి పానకం, వడపప్పు.. ఈ కొత్త స్టైల్ ట్రై చేయండి..
- Finance Gold Rate: గోల్డ్ టెర్రర్ ఎటాక్.. రూ.75,000 రేటుకు పసిడి.. నేడు రూ.9,800 పెరుగుదల..
- Automobiles ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది - ధర, వివరాలు ఇక్కడ చూడండి
- Technology 32MP టెలిఫోటో కెమెరా, 8GB ర్యామ్ Oppo స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. రూ.2999 తగ్గింపు సహా..!!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
Bigg Boss Telugu 3: సీక్రెట్ రూమ్‌లో రాహుల్.. హిమజ అవుట్! గద్దలకొండ గణేష్ గత్తర
బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' రసవత్తరంగా రన్ అవుతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్స్ కోసం ఒకరికోసం ఒకరు చేసిన త్యాగాలు అబ్బో అనిపించాయి. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు చూస్తే..
క్రేజీ టాస్క్‌లు.. షో మరింత ఆసక్తికరం
బిగ్ బాస్ ఇస్తున్న క్రేజీ టాస్క్‌లతో షో మరింత ఆసక్తికరంగా మారుతోంది. రోజు రోజుకూ సరికొత్తగా ట్రెండ్‌ని క్యాచ్ చేస్తూ టాస్క్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇక వీటిపై కంటిస్టెంట్స్ చేస్తున్న పర్ఫార్మెన్స్ బుల్లితెర ఆడియన్స్‌కి వినోదాల విందు ఇస్తోంది. దీంతో ఈ మరింత ఆసక్తికరంగా మారింది.
ఎలిమినేషన్ లిస్టులో ఆ ముగ్గురూ
ఇదిలా ఉంటే ఆ వారం ఎలిమినేషన్ లిస్టులో ముగ్గురి పేర్లు ఉన్నాయి. తొమ్మిదో వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో మహేష్, రాహుల్, హిమజ ముగ్గురూ నామినేట్ అయినట్టు ప్రకటించారు బిగ్ బాస్. ఈ ముగ్గురిలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.
బిగ్ బాస్ ట్విస్ట్
ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక హౌస్‌మేట్ హౌస్ ఎలిమినేట్ కావటం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటున్నట్లు ప్రకటించాడు నాగార్జున. ప్రస్తుతం నామినేషన్లో ఉన్న హిమజ, రాహుల్, మహేష్‌లలో రాహుల్ ఎలిమినేట్ అయినట్టుగా ఎపిసోడ్ చివరివరకూ రక్తికట్టించి చివర్లో ఫేక్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున.
|
సీక్రెట్ రూమ్‌లో రాహుల్
అయితే రాహుల్‌ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్‌లో ఒక్కోసారి హౌస్ మేట్‌ని ఎలిమినేట్ చేసి, వాళ్ళని ఒక సీక్రెట్ రూమ్‌లో ఉంచి కొన్ని రోజులు తర్వాత హౌస్ లోకి తీసుకొనివస్తారు. అప్పట్లో ఫస్ట్ సీజన్లో ముమైత్ ఖాన్ని ఉంచినట్లు ఈ సారి రాహుల్‌ని ఉంచారని తెలుస్తోంది.
హిమజ అవుట్.. గద్దలకొండ గణేష్ గత్తర
అయితే ఇక రెండవ ఎలిమినేషన్ మాత్రం హిమజ మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి నేరుగా వెళ్ళిపోనుందని తెలిసింది. ఇక ఈ రోజు (ఆదివారం) ఎపిసోడ్లో గద్దలకొండ గణేష్ గత్తర లేపడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.