బాంబ్ బ్లాస్ట్‌లో నా బాయ్‌ఫ్రెండ్ మరణించాడు.. నేను దూరం పెట్టడం వల్లనే.. పునర్నవి

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 13 Highlights || Filmibeat Telugu

బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో 12వ రోజు చాలా భావోద్వేగాల మధ్య సాగింది. సెలబ్రిటీలు తాము తీసుకొన్న నిర్ణయాల వల్ల కోల్పోయిన వ్యక్తులను తలచుకొని కుమిలిపోయారు. జీవితంలో మళ్లీ రాబట్టుకొలేని విషయాలను చెప్పి విషాదంలో మునిగిపోయారు. శ్రీముఖి, శివజ్యోతి, పునర్నవి, మహేష్ విట్ట తదితరులు చెప్పిన తమ ఫ్లాష్ బ్యాక్ విషయాలు ప్రేక్షకులను సైతం ఎమోషనల్‌గా మార్చే విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

 బిగ్‌బాస్ వార్నింగ్‌తో

బిగ్‌బాస్ వార్నింగ్‌తో

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇంటి సభ్యులు గెలుచుకొన్న 3000కుపైగా పాయింట్లతో ఇంట్లోకి కావాల్సిన వస్తువులను సెలబ్రిటీలు ఎంపిక చేసుకొన్నారు. పరిమిత సమయంలో వాటిని ఎంపిక చేసుకోకపోవడం, అంతేకాకుండా గేమ్ నియమాలను ఉల్లంఘించడంపై బిగ్‌బాస్ మండిపడ్డారు. తరచుగా ఇలాంటి రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

జీవితంలో విషాద సంఘటనలతో

జీవితంలో విషాద సంఘటనలతో

ఇక బిగ్‌‌బాస్ సెలబ్రిటీలు ఏదైనా తప్పు కారణంగా పశ్చత్తాపం చెందని క్షణాలు ఉన్నాయా? ఉంటే వాటిని షేర్ చేసుకోవాలని అడిగారు. దాంతో సెలబ్రిటీలు ఒక్కొక్కరు తమ విషాద ఘటనలను పంచుకొన్నారు. రాహుల్ సింప్లిగంజ్ ఒక్కరే తన బ్రేకప్ విషయాన్ని హ్యాపీ మూడ్‌లో పంచుకొన్నారు.

 నా బాయ్‌ఫ్రెండ్ బాంబ్ బ్లాస్ట్‌లో

నా బాయ్‌ఫ్రెండ్ బాంబ్ బ్లాస్ట్‌లో

ఇక పునర్నవి తన అనుభవాన్ని చెప్పుకొంటూ.. నాకు మొండిపట్టు ఎక్కువ. దాని వల్ల నేను జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను. నా ఫస్ట్ లవ్ బ్రేకప్ జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను నా బాయ్‌ఫ్రెండ్‌కు దూరమయ్యాను. అతను పదే పదే నాతో మాట్లాడాలని ట్రై చేశాడు. కానీ నేను దూరంగా పెట్టాను. ఓ రోజు శ్రీలంక పర్యటనకు వెళ్లి కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో మరణించాడు. ఆ విషయంలో నేను తప్పు చేశాననే ఫీలింగ్ నన్ను వెంటాడుతున్నది. జీవితంలో ఎవరికైనా నేను సారీ చెప్పాల్సి వస్తే అతడికే అని పునర్నవి భావోద్వేగంలో మునిగిపోయింది.

చివరిచూపుకు నోచుకోలేకపోయాను

చివరిచూపుకు నోచుకోలేకపోయాను

ఇక శ్రీముఖి మాట్లాడుతూ.. మా నాన్న తండ్రి అంటే తాత నాకు చాలా ఇష్టం. మా తాత నన్ను గుడియా అంటూ పిలిచేవారు. ఆయన పక్షవాతంతో మంచాన పడ్డారు. మూతి వంకరగా మారిపోయింది. గుడియా అని కూడా సరిగా పిలువలేకపోయారు. నేను షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో నేను ఎక్కువగా కలువలేకపోయాను. ఓ రోజు మా తాత నన్ను చూడాలని ఉంది అని కబురు పెట్టారు. కానీ ఆ రాత్రి నేను వెళ్లలేకపోయాను. తెల్లవారే సరికి మా తాత చనిపోయాడనే వార్త తెలిసింది. ఆయన చివరి కోరికను తీర్చలేదనే బాధ వెంటాడుతుంది. నేను కూడా చివరి చూపును చూసుకోలేకపోవడం తప్పేననే ఫీలింగ్ వెంటాడుతున్నది అని పునర్నవి చెప్పింది.

 నా ప్రేమ కోసం చావు వరకు వెళ్లాను

నా ప్రేమ కోసం చావు వరకు వెళ్లాను

ఇక సావిత్రి అలియాస్ శివజ్యోతి తన ప్రేమ కథను చెప్పుకొని భోరున విలపించింది. నా భర్తను ప్రేమించిన విషయం పెళ్లికి ముందు మా ఇంట్లో తెలిసింది. దాంతో అతడిని చంపడానికి కూడా సిద్ధపడ్డారు. నన్ను విపరీతంగా కొట్టారు. ఒక నాలిక తప్ప అని చోట్ల కొట్టారు. అయినా నా మొండితనంతో ప్రేమను గెలిపించుకొన్నాను. అన్ని సందర్భాల్లో నాకు అండగా నిలిచిన నా భర్తకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను. నీవే నా ప్రపంచం అంటూ సావిత్రి భావోద్వేగానికి లోనైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X