For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    7వ వారం బిగ్ బాస్ 3 ఎలిమినేషన్ మ్యాటర్ లీక్... అతడే అయితే శ్రీముఖికి షాకే!

    |

    నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న 'బిగ్ బాస్ తెలుగు 3' రియాలిటీ షో విజయవంతంగా రన్ అవుతూ ప్రస్తుతం 7వ వారం ఎలిమినేషన్ లెవల్‌కు చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం అలీ రెజా, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, శ్రీముఖి నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

    శనివారం జరిగిన షోలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగార్జున నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను ఆక్టివిటీ గదిలోకి పంపారు, అందులో ఫ్లాష్ లైట్లు ఉన్నాయి. ఎవరు వెళ్లినపుడు ఆ లైట్ ఆగిపోతుందో వారు సేవ్ చేయబడతారు. లక్కీగా రాహుల్ వెళ్లినపుడు లైట్లు ఆగిపోవడంతో అతడు సేవ్ అయ్యాడు.

    డేంజర్ జోన్లో నలుగురు

    డేంజర్ జోన్లో నలుగురు

    రాహుల్ సిప్లిగంజ్ సేవ్ అవ్వడంతో అలీ రెజా, రవికృష్ణ, శ్రీముఖి, మహేష్ విట్టా డేంజర్ జోన్లోనే ఉండిపోయారు. వీరిలో ఒకరు తప్పనిసరిగా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. ఆదివారం రాత్రి జరిగే షోలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే విషయంపై క్లారిటీ రానుంది.

    మ్యాటర్ ముందే లీకైందా? 7వ వారం బిగ్ బాస్ 3 నుంచి బయటకు వచ్చేది అతడేనా?

    మ్యాటర్ ముందే లీకైందా? 7వ వారం బిగ్ బాస్ 3 నుంచి బయటకు వచ్చేది అతడేనా?

    ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతడే అంటూ.... అలీ రెజా పేరు బలంగా వినిపిస్తోంది. షోలో తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించడంతో పాటు గత కొన్ని రోజులుగా ఇంట్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చిన అలీ రెజాకు... ఈవారం ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని తెలుస్తోంది.

    నాగార్జున గతంలోనే వార్నింగ్ ఇచ్చాడు

    నాగార్జున గతంలోనే వార్నింగ్ ఇచ్చాడు

    బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు చేస్తున్న సమయంలో అలీ రెజా పలు సందర్భాల్లో తన సహనాన్ని కోల్పోయి.... రాష్‌గా, ఆగ్రహంగా ప్రవర్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఓసారి ఆయనకు నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చిన సంగతి లెలిసిందే.

    అతడే అయితే శ్రీముఖికి షాకే!

    అతడే అయితే శ్రీముఖికి షాకే!

    బిగ్ బాస్ హౌస్‌లో అలీ రెజా, శ్రీముఖి చాలా క్లోజ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. శ్రీముఖికి అత్యంత నమ్మకస్తుడిగా, అన్ని విషయాల్లోనూ ఆమెకు హెల్ప్‌గా చేస్తూ కనిపించాడు. ఒక వేళ అలీ రెజా ఎలిమినేషన్ నిజమే అయితే శ్రీముఖి షాకవ్వడం ఖాయం.

    మహేష్ విట్టా

    మహేష్ విట్టా

    అయితే కొన్ని ఆన్ లైన్, సోషల్ మీడియా సర్వేల్లో మహేష్ విట్టాకు తక్కువ ఓట్లు పడటం గమనార్హం. ఎలిమినేషన్ ఛాన్స్ ఇతడికి కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. మరి అలీ రెజా, మహేష్ విట్టాలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలియాలంటే ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షో చూడాల్సిందే.

    English summary
    Ali Reza, Ravikrishna, Rahul Sipligunj, Mahesh Vitta and Sreemukhi were nominated for the elimination from Bigg Boss Telugu 3 in the seventh week. It is rumored that Ali Reza has been eliminated.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X