భార్యతో ముదిరిన గొడవ, మొహంపై కాఫీ విసిరికొట్టి ఏడ్చేసిన వరుణ్ సందేశ్!
Recommended Video
బిగ్‌బాస్ తెలుగు 3 రియాలిటీ షో ప్రారంభ సమయంలో వరుణ్ సందేశ్, వితిక కంటెస్టెంట్లుగా ఎంటరవుతున్న విషయం తెలియగానే సినీ అభిమానుల్లో ఒకరకమైన ఆందోళన వ్యక్తం అయింది. ఈ షో పూర్తయ్యేలోపు వీరు విడిపోతారేమో అని కొందరు? ఇందులో వీరు గెలవకపయినా మంచిదే విడిపోకుండా బయటకు వస్తే చాలు అని మరికొందరు అభిప్రాయ పడ్డారు. వారు ఆ సమయంలో వ్యక్తం చేసిన ఆందోళనే ఇపుడు నిజం అయ్యేలా కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో ఎంటరైన కొత్తలో ఇద్దరూ ప్రేమగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరి మధ్య దూరం క్రమక్రమంగా పెరుగుతోంది. తీవ్రంగా గొడవ పడేస్థాయికి పరిస్థితి దిగజారింది.

సంచలనం రేపుతున్న ప్రోమో
మంగళవారం రాత్రి ప్రసారం అయ్యే షోకు సంబంధించి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో వరుణ్ సందేశ్, వితిక తీవ్రంగా గొడపడుతున్నట్లుగా చూపించారు. దీన్ని ఇద్దరి మధ్య దూరం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తన భార్య వితిక తీరుపై వరుణ్ సందేశ్ అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

భార్య భర్తల మధ్య ముదిరిన గొడవ
‘‘నేను ఏం చేశాను? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావ్? నువ్వు చాలా రూడ్‌గా బిహేవ్ చేస్తున్నావ్'' అంటూ భార్యపై వరుణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం.... నా దగ్గరికి రావొద్దు అంటున్నానంటూ వితిక మండి పడటం.... దగ్గరికి రావొద్దు అంటే నువ్వు ఇంట్లో ఉండొద్దు అని వరుణ్ అసహనానికి గురైనట్లు ప్రోమోలో చూపించారు.

భార్య మొహంపై కాఫీ విసిరికొట్టి ఏడ్చేసిన వరుణ్ సందేశ్!
మరో సీన్లో వరుణ్ సందేశ్ తన కోపాన్ని పట్టలేక భార్య వితిక మొహంపై కాఫీ విరిసికొట్టడం, ఆ తర్వాత ఓ మూలన కూర్చుని ఏడవటం కనిపించింది. మరి ఇద్దరి మధ్య గొడవ జరుగడానికి కారణం ఏమిటి? వరుణ్ సందేశ్ అంతలా రియాక్ట్ ఎందుకు అయ్యారు? అనేది తెలియాలంటే మంగళవారం రాత్రి ప్రసారం అయ్యే షో చూడాల్సిందే.

ఇద్దరూ షో నుంచి బయటకు వస్తేనే బెటర్
రోజు రోజుకు ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవుతుండంతో చాలా మంది ప్రేక్షకలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఇద్దరూ విడిపోయే అవకాశం ఉంది, అలాంటి ఘోరం జరుగకముందే ఇద్దరూ ఈ షో నుంచి బయటకు వస్తే బెటర్ అని కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











