రాహుల్.. నిన్ను చెప్పుతో కొడుతా: హిమజ, శివజ్యోతి ఫైర్, శ్రీముఖి కాళ్లు మొక్కిన సెలబ్రిటీ

Recommended Video

Bigg Boss Telugu Season 3 : Episode 38 Highlights || Filmibeat Telugu

బిగ్‌బాస్ షోలో 37వ రోజు గందరగోళంగా మారింది. రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్, పునర్నవి, హిమజ, మహేష్ నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం రోజు నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీల్లో ముగ్గురిని సేఫ్ చేసేందుకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా ఆరుగురు సెలబ్రిటిల్లో ముగ్గురు.. మరో ముగ్గురిని ఒప్పించి వారు రిస్క్ తీసుకొంటే.. మరో ముగ్గురు సేఫ్ అవ్వడానికి గేమ్ ఆడాలని సూచించాడు. ఆ క్రమంలో మహేష్, పునర్నవి, హిమజను రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్ ఒప్పించి వారు సేఫ్ అయ్యేందుకు గేమ్ ఆడటానికి రెడీ అయ్యారు. సీక్రెట్ టాస్క్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటే..

మొదట రవికృష్ణను బిగ్‌బాస్

మొదట రవికృష్ణను బిగ్‌బాస్

మొదట రవికృష్ణను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి తను ఇచ్చిన కొన్ని ఆషన్లలో రెండింటిని ఎంచుకోవాలని సూచించాడు. అందులో ఒకటి ఇంటి సభ్యుల్లో ఒకరి తలపై షేవింగ్ ఫోమ్ కొట్టాలి. రెండోది ఒకరి బెడ్‌ను వాటర్‌తో పూర్తిగా తడపాలి. అ రెండు పూర్తి చేస్తే నామినేషన్ నుంచి విముక్తి అవుతారని సూచించాడు. ఆ క్రమంలోనే వితిక జుట్టుకు ఫోమ్ కొట్టడంలో సఫలమయ్యాడు. కెప్టెన్ శివజ్యోతి బెడ్‌ను వాటర్‌తో తడిపి వేయడంలో కూడా సక్సెస్ అయ్యాడు.

రెండో వ్యక్తిగా రాహుల్‌ను

రెండో వ్యక్తిగా రాహుల్‌ను

ఇక రెండో వ్యక్తిగా రాహుల్‌ను పిలిచి ఒకరిని రెచ్చగొట్టడం ద్వారా కోపం తెప్పించి వారు తిరిగి తిట్టేలా చేయడం. రెండోది వరుణ్, వితిక హార్ట్ పిల్లోను ముక్కలు ముక్కలుగా చేయాలి. గేమ్ ప్లాన్‌లో భాగంగా అలీని రెచ్చగొట్టి కోపం తెప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మధ్యలో దూరిన శ్రీముఖి, కెప్టెన్ శివజ్యోతికి కూడా కోపం తెప్పించాడు.

రాహుల్‌ దురుసుగా ప్రవర్తించడంతో

రాహుల్‌ దురుసుగా ప్రవర్తించడంతో

సీక్రెట్ టాస్క్ జరుగుతున్న క్రమంలో రాహుల్‌ దురుసుగా ప్రవర్తించడంతో హిమజ రెచ్చిపోయింది. ముఖంపై చెప్పుతో కొడుతాను అని తిట్టింది. కెప్టెన్ శివజ్యోతిని కూడా నోర్ముసుకొని బయటకుపో అనడంతో ఆమె కూడా మనస్తాపం చెందింది. శ్రీముఖిని నెట్టివేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో బిగ్‌బాస్ రంగంలోకి దిగి శారీరక హింసకు తావులేదు అంటూ హెచ్చరించాడు.

ఇక వరుణ్ సందేశ్‌కు

ఇక వరుణ్ సందేశ్‌కు

ఇక వరుణ్ సందేశ్‌కు ఒకటి వితికకు ఇష్టమైన డ్రస్‌ను ముక్కలు ముక్కలుగా చేయాలి. రెండోది కాఫీ కప్పును వితిక ముఖంపై కొట్టాలి. ఈ రెండు పనులు చేస్తే నామినేషన్ నుంచి బయటపడటం జరుగుతుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ క్రమంలో వితికతో వరుణ్ సందేశ్‌కు గొడవ జరిగింది. అయినా వరుణ్ తనలోని ఎమోషన్‌ను అణుచుకొంటూ గేమ్‌ను కొనసాగించాడు.

 వితిక సీరియస్

వితిక సీరియస్

వరుణ్ సీక్రెట్ ఆడుతున్న ఓ దశలో వితిక సీరియస్ అయింది. ఒక్కోసారి ఏం జరుగుతుందో అర్దం కాని పరిస్థితిని ఎదుర్కొన్నది. చివరికి కోపంతో రాత్రికి రా నీ సంగతి చెబుతా అని.. బయటకు వెళ్లిన తర్వాత నీ సంగతి చెబుతా అని వరుణ్‌ను వితిక హెచ్చరించింది. వితికతో బిహేవ్ చేసిన తీరుకు వరుణ్ తనలో తాను బాధపడ్డాడు.

అలీతో రాహుల్‌కు

అలీతో రాహుల్‌కు

సీక్రెట్ టాస్క్‌ ఆటలో రాహుల్‌పై శ్రీముఖి, శివజ్యోతి మండిపడ్డారు. తమపై బిహేవ్ చేసిన తీరు బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలీతో రాహుల్‌కు దండిగానే గొడవ జరిగింది. టాస్క్ సందర్భంగా నేను నాలానే ఆడుతాను. కావాలంటే ఆ తర్వాత సారీ చెబుతాను. నేను నా గేమ్‌ను ఆడుతానని చెప్పాడు. చివరకు టాస్క్ పూర్తి అయిన తర్వాత శ్రీముఖికి సారీ చెప్పినా వినల్లేదు. దాంతో ఓ దశలో కాళ్లు కూడా పట్టుకొనేందుకు ప్రయత్నం చేశాడు.

సీక్రెట్ టాస్క్ పూర్తయిన తర్వాత

సీక్రెట్ టాస్క్ పూర్తయిన తర్వాత

సీక్రెట్ టాస్క్ పూర్తయిన తర్వాత రాహుల్.. హిమజ కాళ్లు మొక్కి దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించాలని కోరాడు. శివజ్యోతి కూడా రాహుల్‌ను క్షమించేసింది. వరుణ్ వితికలు హ్యాపీగా ఫీలయ్యారు. చివరకు మహేష్, హిమజ, పునర్నవి నామినేట్ అయినట్టు.. రవికృష్ణ, వరుణ్ సందేశ్, రాహుల్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X