నా పర్మిషన్ లేకుండా చేయొద్దు.. కావాలంటే నన్ను అడుగు.. అఖిల్‌కు అభిజిత్ వార్నింగ్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 12వ వారాంతంలో ఎపిసోడ్‌లో రకరకాల ఎమోషన్స్ కనిపించాయి. ఇంటిలో వినోదంతోపాటు గొడవలు కనిపించాయి. వేదిక మీదకు వచ్చిన హోస్ట్ నాగార్జున శుక్రవారం ఇంటిలో జరిగిన విషయాలను చూపించాడు. ఈ సందర్భంగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్, అభిజిత్ మధ్య జరిగిన గొడవకు కారణం ఏమిటంటే..

కిచెన్‌లో అఖిల్ దూరడంతో
ఇంటిలో లాస్య విసిరిన బిగ్‌బాంబు కారణంగా అభిజిత్ ఇంటి కిచెన్ భాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సోహెల్ సహకారం అందిస్తున్నాడు. అయితే శుక్రవారం కిచెన్‌లో అఖిల్ వచ్చి దోశలు వేసుకొనేందుకు ప్రయత్నించాడు. నా అనుమతి లేకుండా కిచెన్‌లోకి రావొద్దు. నీకు ఏమైనా కావాలంటే నన్ను అడుగు. నేను చేసి పెడుతాను అంటూ అభిజిత్ అన్నాడు.

సోహెల్‌తో ఉన్న అవగాహన అది..
అభిజిత్ వాదనకు అఖిల్ సంతృప్తి చెందలేదు. దాంతో సొహెల్ నీకు సహాయం చేస్తున్నాడుగా అంటూ అఖిల్ సమాధానం చెబితే.. అది నాకు సోహెల్‌కు మధ్య ఉన్న అవగాహన అంటూ అభిజిత్ అన్నాడు. దాంతో అఖిల్ అాసహనం వ్యక్తం చేశారు. దాంతో ఆ గొడవ మరింత పెరిగింది.

అభిజిత్ సమస్యగా మార్చాకు అంటూ సోహెల్
అఖిల్‌ను వద్దనడంతో సోహెల్ జోక్యం చేసుకొన్నాడు. దీనిని కూడా సమస్యగా సృషించకూడదు అంటూ సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే నాకు బాధ్యత ఇచ్చారు కాబట్టి నన్ను అడిగి వెళ్లాల్సింది. అలా కాకుండా నేరుగా వెళ్లి వంట చేసుకోవడం సరికాదు అంటూ అభిజిత్ అన్నాడు.
Recommended Video

మూడు రోజులుగా తినడం లేదు
అయితే అభిజిత్ మాటలకు హార్ట్ అయిన అఖిల్.. కిచెన్‌లో నుంచి బయటకు వెళ్లిపోతూ ఘాటుగా స్పందించాడు. గత మూడు రోజులుగా టిఫిన్ సరిగా తినడం లేదు. ఏదో చిరుతిండి తినాల్సి వస్తుంది అంటూ విసురుగా పక్కనే ఉన్న వస్తువులను కొట్టి బయటకు వెళ్లిపోవడంతో ఆ గొడవ అంతటి సద్దుమణిగింది.


Click it and Unblock the Notifications











