హద్దు మీరితే ఎలిమినేట్ చేస్తా.. అభిజిత్‌కు నాగ్ వార్నింగ్.. మరోసారి మోనాల్‌ను వెంటాడిన అదృష్టం

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగింపుకు చేరుకొన్నది. 12వ వారాంతంలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు గట్టిగా క్లాస్ పీకారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా జరిగిన గేమ్‌లో కంటెస్టెంట్లు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ దారుణంగా కామెంట్ చేశారు. నాగ్ ఎందుకు క్లాస్ పీకాడు? అలాగే మోనాల్ ఎలా సేఫ్ అయ్యారనే విషయాల్లోకి వెళితే..

హారిక దేత్తడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి

హారిక దేత్తడిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి

వేదిక మీదకు వచ్చిన హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను పలకరించాడు. ఆ తర్వాత హారిక దేత్తడిని ఇంటిలోని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఉత్తమ కెప్టెన్‌ అయినందుకు అభినందించారు. అయితే నా దృష్టిలో బెస్ట్ కెప్టెన్ కాదంటూ ఆమె చేసిన తప్పులను వీడియోగా చూపించి ఇలా చేయడం ఎంత వరకు సబబు అంటూ కామెంట్ చేశారు.

నీవు కెప్టెన్ అయింది అభిజిత్ కోసమా?

నీవు కెప్టెన్ అయింది అభిజిత్ కోసమా?

మోనాల్‌ను అభిజిత్‌తో స్వాప్ చేయడం తప్పని, అలాగే అఖిల్ కాకుండా అవినాష్‌ ఓటు వేయడం కూడా తన మనసుకు నచ్చిన విషయం అంటూ కామెంట్ చేసింది. ఒకవేళ అవి తప్పయితే క్షమాపణ చెబుతానని అన్నారు. నీవు కెప్టెన్ అయింది కేవలం అభిజిత్, మోనాల్ కోసం అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత నీ కోసం నీవు ఆడు. మరొకరి కోసం ఆడకు అంటూ సర్దిచెప్పాడు.

అభిజిత్‌ను ప్రశ్నించిన నాగ్

అభిజిత్‌ను ప్రశ్నించిన నాగ్

ఇక లగ్జరీ బడ్జెట్ ఆడని అభిజిత్‌ను దారుణంగా హోస్ట్ నాగార్జున ఆడుకొన్నాడు. టాస్క్‌లో భాగంగా ఇంటి చెట్టు ఆకులను ఎందుకు లెక్కపెట్టలేదు. అలాగే మోనాల్‌తో డేటింగ్‌కు ఎందుకు వెళ్లేలేదు. బిగ్‌బాస్ రూల్స్‌ను ఎందుకు పాటించలేదు అంటూ నాగార్జున క్లాస్ పీకాడు.

మోనాల్ విషయంలో నేను హర్ట్ అయ్యా

మోనాల్ విషయంలో నేను హర్ట్ అయ్యా

అయితే మోనాల్‌ను ఏడిపించలేదని అందుకే.. ఆ స్టేట్‌మెంట్ అంగీకరించడం ఇష్టం లేక నేను బిగ్‌బాస్‌కు చెప్పి ఆ టాస్క్ నుంచి విరమించుకొన్నాను. మొదటి నుంచి మోనాల్‌తో నాకు చాలా రకాలుగా ఇష్యూస్ వచ్చాయి. అందుకే మళ్లీ ఇలాంటి సమస్యలు రాకూడదని నిర్ణయం తీసుకొన్నాను. అందుకు క్షమాపణ చెబతున్నాను అంటూ అభిజిత్ దండం పెడుతూ వివరణ ఇచ్చాడు.

గేట్లు తీసి బయటకు పంపిస్తా

గేట్లు తీసి బయటకు పంపిస్తా

దాంతో తప్పనిసరిగా బిగ్‌బాస్ రూల్స్ పాటించాలి. లేకపోతే గేట్స్ తీసి బయటకు పంపిస్తాను జాగ్రత్త అంటూ అభిజిత్‌ను నాగ్ హెచ్చరించాడు. ఎవరైనా ఇంటి నియమాలను పాటించాలి. లేకపోతే కఠిన శిక్షను అమలు చేస్తాం. ఎవరైనా తమగేమ్ ఆడాల్సిందే అంటూ నాగ్ హెచ్చరించాడు.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
మోనాల్ గజ్జర్ అలా సేఫ్

మోనాల్ గజ్జర్ అలా సేఫ్

ఆ తర్వాత నామినేషన్‌లో ఉన్న అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్ గజ్జర్‌లలో సేవ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టాడు. తమ పేరు, బొమ్మ ఉన్న ప్యాడ్‌ను ఇచ్చి అందులో ఉన్న ఓ కార్డు బయటకు లాగాలని, అందులో ఎవరు సేఫ్ అని రాసి ఉంటే వారు సేఫ్ అని చెప్పాడు. ముందుగా అరియానా, అవినాష్ లాగితే అన్ సేఫ్ వచ్చింది. ఆ తర్వాత మోనాల్ గజ్జర్ లాగితే సేఫ్ వచ్చింది. దాంతో ఆమె ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత అఖిల్ లాగితే అన్ సేప్ వచ్చింది. దాంతో ఎపిసోడ్ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X