Bigg Boss 13th week elimination: అభిజిత్‌కు రికార్డు ఓటింగ్.. ప్రమాదం అంచున ఆ ఇద్దరు!
బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో 13వ వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నది. ఏడుగురు ఇంటి సభ్యుల్లో ఐదుగురు నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది విషయం చర్చగా మారింది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

బిగ్‌బాస్ తెలుగు 4 విజేత ఎవరు
బిగ్‌బాస్ తెలుగు 4 విజేత ఎవరు అనే విషయం తెలియడానికి ఇంకా రెండు వారాలే గడువు ఉంది. నాలుగో సీజన్ ముగింపుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాంతో 13వ వారం సీజన్ మొత్తానికి కీలకంగా మారింది. దాంతో ఈ వారం ఎలిమినేషన్‌పై అందరి ఆసక్తి నెలకొని ఉంది.

అభిజిత్‌కు రికార్డు స్థాయిలో
13వ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. వారిలో అభిజిత్, అఖిల్, హారిక, అవినాష్, మోనాల్ తదితరులు ఉన్నారు. అయితే ఈ ఐదుగురిలో అభిజిత్‌కు ఎప్పటిలాగానే ఎక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. పోలైన మొత్తం ఓట్లలో అభిజిత్‌కు 35 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిసింది

మోనాల్, అవినాష్ పోటాపోటీగా
ఇక నామినేషన్‌లో ఉన్న అఖిల్‌కు 19 శాతం ఓట్లు, ఆ తర్వాత హారిక దేత్తడి 15 శాతం ఓట్లు సంపాదించుకొన్నట్టు తెలిసింది. అలాగే అవినాష్, మోనాల్ మాత్రం 14 శాతం ఓట్లతో పోటాపోటీగా కొనసాగుతున్నారు. అయితే శుక్రవారం ఓటింగ్ లైన్లు ముగిసే సమయానికి ఉండే పర్సంటేజ్ బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం స్పష్టమవుతుంది.
Recommended Video

మిస్డ్ కాల్ డేటా కీలకం
ఇదిలా ఉండగా, 13వ వారంలో ఓటింగ్‌కు సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ రావడం ఓట్ల శాతం గణనీయంగా కనిపించలేదనే కొందరి వాదన. మిస్డ్ కాల్‌కు సంబంధించిన వ్యవహారంలో సాంకేతిక సమస్యలు రావడం, కాల్ కనెక్ట్ కాకపోవడం జరిగింది. అయితే ఓటింగ్ విషయంలో అవినాష్, మోనాల్ మధ్య ఓటింగ్ తేడా లేకుంటే మిస్డ్ కాల్ డేటాను పరిగణనలోకి తీసుకొంటారు. దాంతో ఈ వారం ఎలిమినేషన్‌లో మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











