twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ నుంచి బోల్డ్ బేబి అవుట్!.. టైటిల్ రేసులో ఆ ఇద్దరు!

    |

    బిగ్‌బాస్‌ తెలుగు 4 సీజన్‌ క్లైమాక్స్‌కు చేరుకొన్నది. చివరి అంకానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూట్‌ను సాయంత్రానికి కల్లా ముగించారు. శనివారం షూటింగులో టాప్‌లోని ముగ్గురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి.. మరో ఇద్దరిని ఆదివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో విజేతను నిర్ణయిస్తారు. తాజా సమాచారం ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందంటే..

    సాధారణ సెలబ్రిటీ నుంచి అసాధారణంగా

    సాధారణ సెలబ్రిటీ నుంచి అసాధారణంగా

    బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోలోకి సాధారణమైన సెలబ్రిటీగా అడుగుపెట్టిన అరియానా అంచెలంచెలుగా అభిమానులను సంపాదించుకొన్నది. 14 వారాల ప్రయాణంలో తనదైన ఆటను ప్రదర్శించిన ఈ యాంకర్ టాప్ కంటెస్టెంట్‌గా నిలిచింది.

    టాప్‌ 5 జాబితాలో అరియానాకు చోటు

    టాప్‌ 5 జాబితాలో అరియానాకు చోటు

    సినీ తారలు, టాప్ యాంకర్ల మధ్య తన ప్రతిభను చాటుకొంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలో చోటు సంపాదించుకొన్నది. ఇంటిలో బోల్డుగా, ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ టైటిల్ రేసులో తాను ఉంటానని సంకేతాలు పంపింది.

    టైటిల్ రేసులో అరియానా అంటూ

    టైటిల్ రేసులో అరియానా అంటూ

    ఇక ఫైనల్ ఓటింగ్ ప్రక్రియ తర్వాత అరియానా గ్లోరికు భారీగా ఓటింగ్ నమోదైందనే ఊహాగానాలు వచ్చాయి. రన్నరప్‌గా నిలుస్తారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు. అయితే తన అభిమానుల ఆక్షాంక్షలకు విభిన్నంగా బిగ్‌బాస్‌తో రెండో రన్నరప్‌గా మూడో స్థానాన్ని సొంతం చేసుకొన్నారు.

    బిగ్‌బాస్ సీజన్‌లో 4 స్థానంలో

    బిగ్‌బాస్ సీజన్‌లో 4 స్థానంలో

    బిగ్‌బాస్‌లో నమోదైన ఓట్ల ఆధారంగా అరియానా గ్లోరి టాప్ 5లోని కంటెస్టెంట్లలో నాలుగో వ్యక్తిగా బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. అంతకుముందే హారిక షో నుంచి అవుట్ అయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అలా అరియానా తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని ముగించినట్టు తెలుస్తున్నది.

    English summary
    Bigg Boss Telugu 4 Elimination: Dettadi Harika out from Top 5 list, Bigg Boss Telugu 4 Grand finale: Sai Pallavi will share Akkinenni Nagarjuna: Bigg Boss Telugu 4 Grand finale updates: Abijeet Duddala breaks Kaushal Manda record: Bigg Boss Telugu 4 Grand Finale all set hit the audience. Endemol shine india organiser are looking at grand event and Star Maa is plaaning Huge TRP rating. Organiser planned that Elimination process going to hit huge TRP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X