Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్‌బాస్ నుంచి బోల్డ్ బేబి అవుట్!.. టైటిల్ రేసులో ఆ ఇద్దరు!
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకొన్నది. చివరి అంకానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూట్‌ను సాయంత్రానికి కల్లా ముగించారు. శనివారం షూటింగులో టాప్‌లోని ముగ్గురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి.. మరో ఇద్దరిని ఆదివారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో విజేతను నిర్ణయిస్తారు. తాజా సమాచారం ప్రకారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందంటే..
సాధారణ సెలబ్రిటీ నుంచి అసాధారణంగా
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలోకి సాధారణమైన సెలబ్రిటీగా అడుగుపెట్టిన అరియానా అంచెలంచెలుగా అభిమానులను సంపాదించుకొన్నది. 14 వారాల ప్రయాణంలో తనదైన ఆటను ప్రదర్శించిన ఈ యాంకర్ టాప్ కంటెస్టెంట్‌గా నిలిచింది.
టాప్ 5 జాబితాలో అరియానాకు చోటు
సినీ తారలు, టాప్ యాంకర్ల మధ్య తన ప్రతిభను చాటుకొంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాలో చోటు సంపాదించుకొన్నది. ఇంటిలో బోల్డుగా, ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ టైటిల్ రేసులో తాను ఉంటానని సంకేతాలు పంపింది.
టైటిల్ రేసులో అరియానా అంటూ
ఇక ఫైనల్ ఓటింగ్ ప్రక్రియ తర్వాత అరియానా గ్లోరికు భారీగా ఓటింగ్ నమోదైందనే ఊహాగానాలు వచ్చాయి. రన్నరప్‌గా నిలుస్తారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేశారు. అయితే తన అభిమానుల ఆక్షాంక్షలకు విభిన్నంగా బిగ్‌బాస్‌తో రెండో రన్నరప్‌గా మూడో స్థానాన్ని సొంతం చేసుకొన్నారు.
బిగ్‌బాస్ సీజన్లో 4 స్థానంలో
బిగ్‌బాస్‌లో నమోదైన ఓట్ల ఆధారంగా అరియానా గ్లోరి టాప్ 5లోని కంటెస్టెంట్లలో నాలుగో వ్యక్తిగా బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. అంతకుముందే హారిక షో నుంచి అవుట్ అయినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అలా అరియానా తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని ముగించినట్టు తెలుస్తున్నది.