twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్వారంటైన్‌లో 16 మంది బిగ్‌బాస్ సెలబ్రిటీలు.. అసలేం జరుగుతున్నదంటే..

    |

    బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4 షోకు రంగం మంతా సిద్దంమైంది. ఇప్పటికే అన్ని రకాలు ఏర్పాట్లు ముగింపు దశకు చేరుకొన్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక, ఇంట్లో వారికి కావాల్సిన వస్తువులు, సౌకర్యాలపై నిర్వాహకులు దృష్టిపెట్టినట్టు సమాచారం. అయితే బిగ్‌బాస్ సీజన్ 4 సంబంధించిన విషయాలు చాలా ఆసక్తిని రేపుతున్నాయి. ఆ వివారాల్లోకి వెళితే..

    కరోనా‌వైరస్ పరిస్థితుల ప్రభావంతో

    కరోనా‌వైరస్ పరిస్థితుల ప్రభావంతో

    జూన్, జూలై మాసాల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు హైదరాబాద్ పరిస్థితి చూస్తే బిగ్‌బాస్ 3 ప్రారంభమవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కరోనావైరస్ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో ఈ రియాలిటీ షో నిర్వాహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కొన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలతో షోను నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

    16 మంది సెలబ్రిటీలకు టెస్టులు

    16 మంది సెలబ్రిటీలకు టెస్టులు

    ఆగస్టు మాసంలో కూడా హైదరాబాద్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఈ షోకు కావాల్సిన 16 మందిని ప్రాథమికంగా ఎంపిక చేసుకొని వారికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించిన తర్వాత సెలబ్రిటీల ఆరోగ్య పరిస్థితిపై ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత వారికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారిని దాదాపు స్వీయ గృహ నిర్బంధంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నట్టు సమాచారం.

    సెలబ్రిటీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు

    సెలబ్రిటీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు

    బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 4 షో ప్రారంభానికి ఇంకా 10 రోజుల సమయం ఉండటంతో నిర్వాహకులు సెలబ్రిటీల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకొంటూ ఎప్పటికప్పుడు వారి కార్యకలాపాలను పర్యవేక్షించే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వారి షాపింగ్, ఇతర కార్యక్రమాలను నిశితంగా పరిశీలించినట్టు సమాచారం. ఇలాంటి జాగ్రత్తల మధ్య రెండు రోజుల క్రితం వారిని క్వారంటైన్‌కు తరలించినట్టు తెలుస్తున్నది.

    షో ప్రారంభానికి ముందే కోవిడ్ 19 టెస్టులు

    షో ప్రారంభానికి ముందే కోవిడ్ 19 టెస్టులు

    బిగ్‌బాస్ సెలబ్రిటీలకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించి మొత్తం 16 మంది కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో పెట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నట్టు సమాచారం. అలాగే షో ప్రారంభానికి రెండు రోజుల ముందు వారికి పూర్తిస్థాయి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించి హౌస్‌లోకి పంపడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

    Recommended Video

    Metro Kathalu Movie Actor Thiruveer Interview
    ఆగస్టు 30 నుంచి నాగ్ హోస్ట్‌గా షో

    ఆగస్టు 30 నుంచి నాగ్ హోస్ట్‌గా షో

    టాలీవుడ్ మన్మథుడు నాగార్జున అక్కినేని రెండోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 షో ఆగస్టు 30న ప్రారంభం కానున్నది. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో ఇంటికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయాయి. ఇంటికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చినట్టు తెలిసింది.

    English summary
    Bigg Boss Telugu Season 4: Biggest Realty show of Bigg Boss Telugu all set to go on air. Host Nagarjuna's Show will start from August 30th. Before the show, All the 16 members of celebrities kept in quarantine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X