వాడేంటిరా... మోనాల్‌ను వేసేశాడు.. నోరు వెళ్లబెట్టిన అమ్మా రాజశేఖర్!
బిగ్‌బాస్ ఇంటిలో 9వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అమ్మా రాజశేఖర్, హారిక, అభిజిత్ మధ్య వాగ్వాదం భారీగా జరిగినట్టు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో స్పష్టమైంది. అయితే ఇప్పటి వరకు కనిపించిన సాధారణ పరిస్థితి కంటే అసాధారణంగానే కనిపించడంతో తాజా ఎసిసోడ్ ఇంట్రెస్టింగ్ మారే అవకాశం కనిపిస్తున్నది. ఇక వివరాల్లోకి వెళితే..

మోనాల్‌ను నామినేట్ చేసిన అఖిల్
నామినేషన్ ప్రక్రియలో భాగంగా మోనాల్ గజ్జర్‌ను అఖిల్ సార్థక్ నామినేట్ చేయడంపై ఇంటి సభ్యులు షాక్ తిన్నారు. లాస్య, అమ్మా రాజశేఖర్ దిగ్బ్రాంతికి గురి అయ్యారు. ఆయనేంటి మోనాల్‌ను నామినేట్ చేస్తున్నాడని లాస్య అంటే.. వాడేంటిరా మోనాల్‌ను వేసేశాడు అంటూ అమ్మా రాజశేఖర్ నోరెళ్లబెట్టారు.

హారిక నోర్మూసుకో.. అమ్మా రాజశేఖర్
ఇక హారిక దేత్తడిపై అమ్మా రాజశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోర్మూయ్ అంటూ ఆమెను కసరుకొన్నారు. అయితే నీవు నోర్మూయ్ అని ఎందుకు అంటున్నారు? అని హారిక బదులిస్తే.. నీవు ఎవరి నోరు మూయలేవు అంటూ ఘాటుగా అభిజిత్ సమధానం ఇచ్చారు. నిన్ను ఆ పాయింట్ మీద నామినేట్ చేశాను అని అభిజిత్ అంటే.. చేశావు అని చెప్పావుగా.. చేసుకో పో అమ్మా రాజశేఖర్ పవన్ కల్యాణ్ స్టైల్‌లో సెటైర్ వేశారు.

నువ్వు డిసైడ్ చేస్తావా?
అఖిల్, అమ్మా రాజశేఖర్ మధ్య వాగ్వాదం ఘాటుగానే జరిగింది. నీవు నన్ను ఇంటి నుంచి పంపించడానికి డిసైడ్ చేస్తావా అంటూ అమ్మా రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. అయితే మాస్టర్ మాటలకు అఖిల్ ఎలా స్పందించాడో సోమవారం ఎపిసోడ్‌లో చూడాల్సిందే. అలాగే నామినేషన్ వేయను అంటూ అమ్మా రాజశేఖర్ ఇంట్లోకి వెళ్తూ కనిపించాడు.

అవినాష్‌పై అభిజిత్ ఫైర్
అవినాష్, అభిజిత్ మధ్య కూడా గట్టిగానే గొడవ జరిగినట్టు కనిపించింది. ఏదో సందర్భంలో ఐ యామ్ కమెడియన్.. ఐయామ్ ఎంటర్‌టైనర్ అంటూ అవినాష్ గట్టిగా అరిస్తే.. అయితే చప్పట్లు కొట్టండిరా అంటూ అభిజిత్ అన్నాడు. అందుకు నేనే చప్పట్లు కొడుతాను అని అవినాష్ క్లాప్స్ కొట్టాడు. ఇలాంటి వ్యవహారం చూస్తే.. నామినేషన్ల ప్రక్రియ భారీగానే గొడవలకు దారి తీసిందనే విషయం స్పష్టమవుతున్నది.


Click it and Unblock the Notifications











