Bigg Boss Telugu 4: 11వ కంటెస్టెంట్‌గా రణం దర్శకుడు అమ్మా రాజశేఖర్
ఎన్నో రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులను ఊరిస్తూ వస్తోన్న బిగ్‌బాస్ షో ఎట్టకేలకు ప్రారంభమైది. ఇక ప్రతీ ఇంట్లో సందడి నెలకొంటుంది. కంటెస్టెంట్ల గొడవలు, ప్రేమలు, ఆపాయ్యతలు, బంధాలు, అనుబంధాలు, రాగద్వేషాలు, ఆట పాటలతో తెలుగు ప్రజల ఇంట్లో సందడి చేయబోతోన్నారు. హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న నాగార్జున.. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ అమ్మా రాజశేఖర్‌ను 11వ కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు.
16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. డైరెక్టర్‌గా వచ్చి నెంబర్ వన్‌గా నిలువాలని ఉన్నాను. కొద్ది రోజులుగా నాకు హిట్లు లేవు. కొంత గ్యాప్ వచ్చింది. బిగ్‌బాస్ ద్వారా మళ్లీ నెంబర్‌వన్ నిలువాలని కోరుకొంటున్నాను. అందుకే బిగ్‌బాస్‌లోకి వచ్చాను. ఇంతకు ముందు బిగ్‌బాస్‌లో నా శిష్యుడు బాబా భాస్కర్ వచ్చారు. ఇప్పుడు నేను రావడం చాలా హ్యాపీగా ఉంది అంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు.

కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన అమ్మా రాజశేఖర్ ఆ తరువాత దర్శకుడిగా మారారు. తమిళ నాడుకు చెందిన రాజశేఖర్ అమ్మ మీద ప్రేమతోనే ఆ పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇక 2006లో గోపిచంద్ తో తెరకెక్కించిన రణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు.
రణం సినిమా సక్సెస్ అయిన తరువాత రవితేజతో ఖాతార్నాక్ అనే సినిమాను డైరెక్ట్ చూశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాజశేఖర్ ఈ మధ్య కాలంలో పెద్దగా కనిపించింది లేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అమ్మా రాజశేఖర్ సరికొత్తగా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. మరి ఈ రియాలిటీ షోలో ఈ మల్టీటాలెంటెడ్ టెక్నీషియన్ ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











