Bigg Boss Telugu 4: ఐదో కంటెస్టెంట్‌గా టెలివిజన్ హోస్ట్ సుజాత..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో ఐదో కంటెస్టెంట్‌గా టెలివిజన్ హోస్ట్ సుజాత హౌస్‌లోకి ప్రవేశించారు. తన గురించి చెప్పే వీడియోలో తన బాల్యంలోని కష్టాలను చెప్పారు. ఓ సమయంలో తిండి తినడానికి కూడా కష్టపడ్డాం అని అన్నారు.
హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌కు సంబంధించిన ఉద్యోగం చేశాను. ఓ సందర్భంలో నాకు తెలిసిన వాళ్లు టెలివిజన్ ఛానెల్‌లో తెలంగాణ భాష మాట్లాడే యాంకర్ కోసం చూస్తున్నారంటే ఇంటర్వ్యూకు వెళ్లాను. వాళ్లు పెట్టిన ఆడిషన్ హాజరయ్యాను. వెంటనే వాళ్లు నన్ను సెలెక్ట్ చేయడంతో టెలివిజన్ యాంకర్‌గా మారిపోయాను. అప్పటి నుంచి నా కంటూ గుర్తింపు వచ్చింది అని సుజాత చెప్పారు.

నాగార్జునను బిట్టూ అంటూ ముద్దుగా పిలుస్తూ ఇంటి వేదికపై అల్లరి చేశారు. నాగార్జున ఆ అమ్మాయికి గిఫ్టు అందించారు. యాంకర్ సుజాత్ వరంగల్ జిల్లాకు చెందిన ఉప్పరపల్లి గ్రామానికి చెందిన యువతి. తెలంగాణ భాషలో గయ్యాలి హోస్ట్‌గా మంచి హోస్ట్‌గా ప్రేక్షకదారణను మూటగట్టుకొన్నారు.


Click it and Unblock the Notifications











