Bigg Boss Telugu 4: బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అరియానా గ్లోరి.. పదో కంటెస్టెంట్‌గా
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రెండోసారి హోస్ట్‌గా నాగార్జున వేదికపై అదరగొట్టేశారు. బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లే కంటెస్టెంట్లను ఇంటిలోకి పంపే ముందు సెలబ్రిటీలను వేదికపైకి పిలిచి వారిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ యంగ్ అండ్ టాలెంటెడ్ వీడియో జాకీ అరియానా గ్లోరి నవ్వులు చిందిస్తూ తెరపైకి వచ్చారు. ఆమె పదో కంటెస్టెంట్‌గా ఇంటిలోకి ప్రవేశించారు.
అరియానా గ్లోరి పేరుకు తగినట్టుగానే అందం, అభినయం కలబోసిన వీడియో జాకీ. ముద్దు ముద్దు మాటలతో ప్రముఖుల నుంచి సమాధానాలు రాబడుతూ ఆకట్టుకొంటున్నారు. ఆమెకు ఉన్న ప్రతిభాపాటవాలను గుర్తించిన బిగ్‌బాస్ టీమ్ ఇంటిలో ఉండే అవకాశం కల్పించింది.

ఇటీవల రాంగోపాల్ వర్మతో జరిగిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారడంతో అరియానా గ్లోరి మరికొంత మందికి చేరువయ్యారు. అరియానా అందంపై పొగడ్తలు జొప్పిస్తూ వర్మ కామెంట్లు చేయడంతో ఆ ఇంటర్వ్యూ మరింత క్రేజ్‌ను సంపాదించుకొన్నది. కరోనా పరిస్థితుల కారణంగా టాస్క్‌లు ఫిజికల్ ఉండకుండా చూసినట్టు తెలుస్తున్నది. అందుకే ఈ సారి ఎక్కువ మంది మహిళాల కంటెస్టంట్లను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











