Bigg Boss Telugu 4: సీక్రెట్ రూంలో ఆరియానా, సోహెల్
బుల్లితెరపై బిగ్‌బాస్ షో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కాంట్రవర్సీలకైనా సరే, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్ కైనా సరే బిగ్‌బాస్ అడ్డాగా మారింది. మనిషికి ఉండే సర్వ సాధారణ ఎమోషన్స్‌ను బయటకు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు బిగ్‌బాస్. అలాంటి బిగ్‌బాస్ షో తెలుగులో దిగ్విజయంగా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక నేడు నాల్గో సీజన్ మొదలైంది. ఎన్నో మలుపులు, ఇంకెన్నో వాయిదాలు పడుతూ.. మొత్తంగా తెలుగు ప్రేక్షక దేవుళ్లను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేశాడు. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ కార్యక్రమం లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
తొమ్మిదో కంటెస్టెంట్‌గా వెండితెరపై హీరోగా, బుల్లితెరపై సీరియల్ హీరోగా ఆకట్టుకున్న సోహెల్, పదో కంటెస్టెంట్‌గా హాట్ యాంకర్ ఆరియాగా గ్లోరీ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిద్దరి ఎంట్రీతోనే ఓ ఆట ఆరంభించేశాడు బిగ్ బాస్. వీరిద్దరిని ఓ సీక్రెట్ రూం (నైబర్ రూం)లోకి పంపించాడు. కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తుందని నాగ్ తెలిపాడు.

మీరిద్దరూ స్పెషల్ కేటగిరీ అందుకే స్పెషల్ రూంలోకి పంపిస్తున్నామని నాగ్ తెలిపాడు.. బిగ్‌బాస్ హౌస్‌లోకి కాకుండా నైబర్ రూంలోకి వెళ్లాలని, మళ్లీ హౌస్‌లోకి ఎప్పుడు వెళ్లాలనే విషయాలన్నీ బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు అని నాగ్ చెప్పుకొచ్చాడు. ఆపై ఇద్దరూ సీక్రెట్ బిగ్‌బాస్ నైబర్ రూంలోకి వెళ్లారు. ఆ రూంను చూసి ఇద్దరూ ఎగ్జైట్ అయ్యారు. అందులో వారికి సపరేట్ టీవీ, సపరేట్ బెడ్రూమ్స్, ఫోన్ కూడా ఉన్నాయి. సోహెల్ అంతా బద్మాష్ ఎవ్వరూ లేరు ఆరియానా కామెంట్ చేసింది. కావాల్సినవన్నీ బిగ్‌బాస్ ఏర్పాటు చేస్తారని నాగ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











