అరేయ్ సోహైల్‌గా నువ్వు నా కోసం పోతావారా?.. ఇచ్చి పడేసిన అరియానా
బిగ్ బాస్ హౌజ్ లో త్యాగాలు అనేవి చాలా రేర్ గా ఉంటాయి. కంటెస్టెంట్స్ ఎంత క్లోజ్ గా ఉన్నా కూడా బిగ్ బాస్ టైమ్ చూసి వాళ్ల మధ్య చిచ్చు పెట్టడం కామన్. 70రోజులు దాటిన బిగ్ బాస్ ప్రయాణం ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. వారం వారం ఎలిమినేషన్ ప్రక్రియ సరికొత్త వాతావరణం క్రియేట్ చేస్తోంది. మొన్నటివరకు సన్నిహితులుగా ఉన్న వారు కూడా వెన్నుపోట్లు పొడుచుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పవచ్చు.

త్యాగాలకు ఎండ్ కార్డ్
హౌజ్ లో త్యాగాలు చాలా వరకు రసవత్తరంగా ఉంటాయి. అయితే త్యాగాలు ఎమోషన్స్ హౌజ్ లో చూపిస్తే ఎవ్వరికీ నచ్చదు. ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలని నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. బిగ్ బాస్ మొదట్లో త్యాగాలు కాస్త ఎక్కువైనా సీన్స్ చాలానే కనిపించాయి. ఇక ఇప్పుడు మాత్రం కనీసం కెప్టెన్సీ పోస్ట్ కాదు కదా.. రేషన్ మేనేజర్ పోస్టు కోసం కూడా త్యాగాలు చేయడం లేదు.

ఆ విషయం క్లియర్ గా అర్ధమయ్యింది
73వ ఎపిసోడ్ లో అరియానా ద్వారా ఒక విషయం చాలా క్లారిటీ గా అర్ధమయ్యింది. బెడ్ పై నుంచి కళ్ళు తెరవగానే సోహెల్, అరియానా ఇంట్లో త్యాగాల గురించి బాగానే మాట్లాడుకున్నారు. రానున్న రోజుల్లో ప్రతి విషయంలో త్యాగాలు ఇంకా ఎక్కువగా చేయాలని ఉంటుందని వారికి చాలా క్లియర్ గా అర్ధమయ్యింది.

ఇచ్చి పడేసిన అరియానా..
ఇక అరియానా ఎమోషన్స్ ని పక్కనపెట్టి బిగ్ బాస్ కి ఇచ్చి పదేసింది. త్యాగాలు చేయడానికి నేను సిద్ధంగా లేను. నా గురించి ఆలోచించి మాత్రమే అడతాను గాని ఎవరికోసమో త్యాగం చేయాల్సిన అవసరం తనకు లేదని కుండబద్దలు. కొట్టేసింది. అలాగే నేను 12వ వారంలో కూడా కొనసాగాలని అనుకుంటున్నట్లు చెబుతూ అవసరం అయితే ఇక్కడే ఉండిపోతాను అంటూ కౌంటర్ ఇచ్చింది.
Recommended Video

నువ్వు నా కోసం పోతావరా?
ఇక సోహైల్ కి కూడా అరియానా చాలా ఓపెన్ గానే చెప్పేసింది. అరేయ్ సోహైల్‌గా నువ్వు నా కోసం పోతావరా? అంటూ డైరెక్ట్ గా అడగడంతో.. సోహెల్ కూడా నేను పోను..నువ్వు అయితే అసలే పోవు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. దీంతో హౌజ్ లో త్వరలో న్యూ ట్విస్టులు చోటు చేసుకోబోతున్నట్లు అర్ధమవుతోంది. తనతో క్లోజ్ గా ఉండే అవినాష్ ఎలిమినేషన్ లో ఉంటే కొంచెం కూడా తట్టుకోలేని అరియానా ఈ సారి అతని విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











