తేడా వస్తే నీ సంగతి చెబుతా.. అప్పుడు నీ పుంగి పగులుద్ధి.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన అవినాష్

మంగళవారం ఎపిసోడ్ తో బిగ్ బాస్ హౌజ్ ఒక్కసారిగా రాజకీయ వాతావరణంతో కనిపించింది. సాధారణంగా హౌజ్ లో నిత్యం జరిగే పరిణామాలు రాజకీయాలను తలపిస్తాయి. ఇక బిగ్ బాస్ ద్వారా ఈ సారి ఎన్నికల ప్రచారాలను కూడా చూడాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టుతో కంటెస్టెంట్స్ కూడా పోటాపోటీగా సేవ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఇచ్చిన సమయంలో అవినాష్ ఇచ్చిన ఒక కౌంటర్ మామూలుగా లేదు. అఖిల్ విషయంలో సోహెల్ పై అతను అనుమానాలు కూడా వ్యక్తం చేశాడు.

ఒక్కసారిగా ఎగబడ్డారు

ఒక్కసారిగా ఎగబడ్డారు

కంటెస్టెంట్స్ ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ టాస్క్ విషయానికి వేస్తే చాలా స్వార్థంగా ఆలోచిస్తారు. ఇక సోమవారం అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ మంగళవారం ఆ నలుగురికి మరొక ఛాన్స్ ఇచ్చాడు. హౌజ్ లో కొన్ని చోట్ల జెండాలను పెట్టించారు. అయితే ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తే వాళ్ళు సేవ్ అవుతారని చెప్పగా కంటెస్టెంట్స్ బజార్ మోగగానే ఒక్కసారిగా ఎగబడ్డారు.

దొంగల భయం.. కడుపులో దాచుకున్నారు

దొంగల భయం.. కడుపులో దాచుకున్నారు

జెండాలను కలెక్ట్ చేసే సమయంలో మోనాల్ కు హారిక, అభి హెల్ప్ చేయగా అఖిల్ కు సోహెల్ సహాయం చేశాడు. అక్కడ ఉంది.. ఇక్కడ ఉన్నాయ్ అంటూ సపోర్ట్ చేశారు. అయితే అవినాష్ అరియానా టాస్కులో ఒంటరిగానే పోటీపోటీగా గేమ్ లో బిజీ అయ్యారు. చాలా వరకు అవినాష్, అఖిల్ మధ్య పోటీ గట్టిగానే నడిచింది. పైగా లాగేసుకునే అవకాశం ఉండవచ్చని డ్రెస్ లోపల కడుపులో దాచేసుకున్నారు కంటెస్టెంట్స్.

ఎక్కడో దాచావ్.. నిజం చెప్పు

ఎక్కడో దాచావ్.. నిజం చెప్పు

ఇక దాదాపు జెండాలన్ని కలెక్ట్ చేయడంతో కాస్త స్లో అయిన అవినాష్, అఖిల్ మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్యలో సోహెల్ కూడా ఉన్నాడు. వారి మధ్య జరిగిన చర్చ హాట్ టాపిక్ గా నిలిచింది. ముందు అవినాష్ నువ్వు ఎక్కువ కలెక్ట్ చేసి తక్కువ అని చెప్పే రకం ఎక్కడో దాచావ్ అన్నాడు.. అందుకు అఖిల్ అలా ఏమీ లేదని అన్నాడు. కనీసం నువ్వైనా చెప్పాలి సోహెల్ అని అవినాష్ అడుగగా నాకు కూడా తెలియదని సోహెల్ సమాధానం ఇచ్చారు.

నీ పుంగి కూడా పగుల్తది

నీ పుంగి కూడా పగుల్తది

సోహెల్, అఖిల్ ఇద్దరు నవ్వుతూ ఉండడంతో ఒక రకంగా అవినాష్ కు అనుమానం వచ్చింది. తేడా వస్తే ఇద్దరితో మాట్లాడను అంటూ కౌంటర్ ఇచ్చాడు. అలాగే సోహెల్ ని చూస్తూ.. నీ పుంగి కూడా పగుల్తది అని ఆన్సర్ ఇచ్చాడు అవినాష్. ఈ రకంగా వారి మధ్య నవ్వుల్లోనే మాటలు తూటాలు పేలాయి. అయితే అఖిల్ ఎక్కువ కలెక్ట్ చేసిన విషయం బయటకు చెప్పలేదు.

పోటీపడిన అవినాష్ అఖిల్

పోటీపడిన అవినాష్ అఖిల్

అఖిల్ 35జెండాలు సేకరించగా.. అవినాష్ 28, మోనాల్ 20, అరియానా 17 జెండాలను దక్కించుకున్నారు. అందులో అఖిల్, అవినాష్ ఎక్కువ కలెక్ట్ చేశారు. అయితే టాప్ 2లో ఉన్న ఇద్దరికి మరో అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ ఎన్నికల ప్రచారాలు మాదిరిగా ఓట్లు అడగాలని టాస్క్ ఇచ్చాడు. వారిద్దరికీ మిగిలిన ఐదుగురు ఓటు వేసే అవకాశం కల్పించారు. అందుకోసం ఎన్నికల ప్రచారం మాదిరిగా ఓట్లు అడగాలని చెప్పడంతో అవినాష్, అఖిల్ పోటీపడ్డారు.

ఆ విషయం ముందే అర్ధమయ్యింది

ఆ విషయం ముందే అర్ధమయ్యింది

ఇక అఖిల్, అవినాష్ వారి పార్టీ గుర్తులతో బిగ్ బాస్ హౌజ్ ని రాజకీయ రణరంగంగా మార్చారు. ఇక అరియానా గుర్రం గుర్తుకే మన ఓటు అంటూ అవినాష్ కు సపోర్ట్ చేసింది. మరోవైపు అదే తరహాలో సోహెల్ తన మిత్రుడు అఖిల్ కు సపోర్ట్ చేస్తూ కనిపించాడు. అప్పుడే నాలుగు ఓట్లు చాలా ఈజీగా ఎవరికి పడతాయో అర్ధమయ్యింది. అరియానా, అభి ఇద్దరు అవినాష్ కి ఫిక్స్ అవ్వగా.. సోహెల్, మోనాల్ ..అఖిల్ కు ఓటేస్తారని ముందే అర్ధమయ్యింది. ఇక హారిక గేమ్ చెంజర్ గా అవినాష్ కి ఓటేసి సేవ్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X