BIGG BOSS 4: హోటల్ టాస్క్‌లో టార్చర్.. కుప్పకూలిపోయిన అభి, అమ్మ రాజశేఖర్
బిగ్ బాస్ 4లో రోజురోజుకు టాస్కుల గోల మరింత వైరల్ గా ముదురుతోంది. కంటెస్టెంట్స్ లో అసలు రంగులు చాలా క్లియర్ గా బయటపడుతున్నాయి. ఈ వారం ఎక్కువగా అవినాష్ కి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ హాట్ టాపిక్ అయ్యేలా కనిపిస్తోంది. దెబ్బకు ముగ్గురు కంటెస్టెంట్స్ కుప్పకూలిపోతున్నారు. నిజంగా బిగ్ బాస్ లో ఇలాంటివి కామన్ అయినప్పటికీ కొత్తగా చూసేవాళ్ళు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. ఇదేమి క్రూరత్వంరా బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

హోటల్ టాస్క్ కాదు.. ఫిజికల్ టాస్క్
ఇక ఈ రోజు బీబీ హోటల్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నట్లు అర్ధమవుతోంది. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ టీజర్ ని రిలీజ్ చేసిన స్టార్ మా షోపై మరింత హైప్ క్రియేట్ చేసింది. సాధారణంగా హోటల్ టాస్క్ ఫిజికల్ టాస్క్ లాగా అవుతోందని చాలా క్లియర్ గా అర్ధమవుతోంది. అమ్మా రాజశేఖర్, అభిజిత్, అఖిల్ కి అందరూ చుక్కలు చూపించినట్లు అర్ధమవుతోంది.

ఎక్కువగా వాళ్లే బలవుతున్నారు
హోటల్ లో సిబ్బందిగా ఉన్న రాజశేఖర్, అభిజిత్, అఖిల్ ఎలాగైనా గెస్ట్ లుగా ఉన్న వారిని మెప్పించి తీరాలి. స్టార్స్ ని పొందగలిగితే టాస్క్ లో దాదాపు సక్సెస్ అయినట్లే. అయితే ప్రతిసారి టాస్క్ లో కష్టపడుతున్న వారే బిగ్ బాస్ ముందు బలవుతున్నారు. అవినాష్ ఒకవైపు ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటూనే తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లతో కంటెస్టెంట్స్ ను వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

చుక్కలు చూపిస్తున్నారు
ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో అమ్మా రాజశేఖర్ సిమ్మింగ్ ఫూల్ లో దుకే టాస్క్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. నీళ్లలోకి దూకి మళ్ళీ పైకి రావాలి. అలా వంద సార్లు అయినా ఓకే అంటూ అమ్మా రాజశేఖర్ చెప్పిన విధానం చూస్తుంటే వాళ్ళు ఏ స్థాయిలో చుక్కలు చూపిస్తున్నారో అర్ధమవుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కుప్పకూలిన అభిజిత్
ఇక మరోవైపు లవర్ బాయ్స్ అభిజిత్, అఖిల్ కూడా హోటల్ గెస్ట్ లను మెప్పించడానికి వర్కౌట్స్ తో గట్టిగానే పోటీ పడ్డారు. ముందుగా అఖిల్ కి కూడా పుష్ అప్స్ 75కి పైగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు బాగా అలసిపోయినట్లు అర్ధమయ్యింది. అలాగే అభిజిత్ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ తో బాగానే చేమటోడ్చాడు. ఏకంగా 50కి పైగా చేయడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
Recommended Video

చాలా భయంగా ఉంది లాస్య
అమ్మా రాజశేఖర్ కూడా స్విమ్మింగ్ ఫూల్ డైవ్ లతో అలసిపోయి కిందపడిపోయాడు. అయితే ఈ టాస్క్ లను చూసిన కొందరు కంటెస్టెంట్స్ గుండెల్ని పట్టుకున్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా భయంగా ఉంది లాస్య అంటూ సుజాత చెప్పిన విధానం చూస్తుంటే హౌజ్ లో వాతావరణం ఎలా ఉందో అర్ధమవుతోంది. స్టార్స్ కోసం హోటల్ సిబ్బందిని గెస్ట్ లు ఈ రేంజ్ లో టార్చర్ చేయడం నిజంగా దారుణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











