అభిజిత్ మళ్లీ మైండ్ గేమ్.. సోహైల్‌కు మోనాల్ గజ్జర్ షాక్
బిగ్‌బాస్ తెలుగు 4లో 10వ వారం కోసం నిర్వహించిన కెప్టెన్సీ టాస్క్‌లో ఇంటి సభ్యులు మైండ్ గేమ్, ఏమోషన్స్ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఒకరిపై మరొకరు ఎమోషనల్‌గా కామెంట్ చేసుకొంటూ భావోద్వేగానికి గురయ్యారు. లాస్య, అభిజిత్, సోహైల్, మోనాల్ గజ్జర్ మధ్య సాగిన ఎమోషనల్ సంభాషణ ఇంటి సభ్యులను ఆలోచింపజేసేలా చేసింది. ఇంతకు కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఏం జరిగిందంటే..

అభిజిత్ మైండ్ గేమ్
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఆఖరి బంతి గేమ్‌ను ఇంటి సభ్యులు పట్టుదలతో ఆడినట్టు కనిపించింది. మరోసారి అభిజిత్ గేమ్‌లో మైండ్‌ను ఉపయోగించినట్టు స్పష్టమైంది. హారికతో తన మైండ్ గేమ్‌ను చర్చిస్తూ కనిపించారు. ఎలా ఆడాలి అనే విషయాన్ని హారికకు చెబుతూ కెప్టెన్సీ రేసులో ఉండేందుకు ప్లాన్ చేసుకొన్నాడు.

లాస్యకు అభిజిత్ పాఠాలు..
ఆఖరి బంతి గేమ్ సందర్భంగా అదే మైండ్ గేమ్ అంటూ లాస్య చెబుతూ కనిపించింది. ఇక అభిజిత్.. మన బాల్‌ను పట్టుకొని.. వేరే వారి బాల్‌ను తోసేయాలి అంటూ అవినాష్‌కు చెబితే.. అదే గేమ్ అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా అభిజిత్ ప్లాన్స్, వ్యూహాలు పన్నుతూ కనిపించారు.

సోహైల్, మెహబూబ్ వీరంగం
ఇంటిలో రిలేషన్స్, బాండ్స్, ఫ్రెండ్‌షిప్ ఇలాంటవన్నీ బక్వాస్ అంటూ అఖిల్ ఫైర్ అయ్యాడు. అంతకుముందు మెహబూబ్, సోహైల్ బంతిని కోపంగా కాలితో తన్నుతూ ఊగిపోయారు. ఆ తర్వాత మోనాల్, సోహైల్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. నామినేషన్ విషయంలో ఘాటుగా స్పందించాడు.

అఖిల్ నిన్నే సేవ్ చేస్తాడంటూ
మోనాల్‌తో సోహైల్ మాట్లాడుతూ.. ఒకవేళ నేను, అఖిల్ ఉంటే.. నువ్వు అఖిల్‌నే సేవ్ చేస్తావు. ఇది రాసిపెట్టుకో అంటూ ఆవేశంగా మాట్లాడాడు. అయితే సోహైల్ మాటలకు సమాధానం ఇస్తూ.. ఒకవేళ నువ్వు, నేను ఉంటే అఖిల్ నిన్నే సేవ్ చేస్తాడు. గుర్తుంచుకో అంటూ మోనాల్ షాకింగ్ పంచ్ విసిరింది. ఇలా ఎమోషనల్‌గా ఇంటి సభ్యుల మధ్య సన్నివేశాలు కనిపించాయి.
Recommended Video

ఇంత అగ్లీగా ఎందుకు అంటూ..
ఇక కెప్టెన్సీ టాస్క్‌లో చేలరేగిన సంఘటనలపై అభిజిత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గేమ్ ఆడిన తీరుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. గేమ్‌ను ఎందుకు ఇంత అగ్లీగా ఎందుకు ఆడుతారో అర్థం కావడం లేదు అంటూ అభిజిత్ ఊగిపోయాడు. లాస్య, హారికలు వింటుండగా అఖిల్, సోహైల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు అర్థమైంది.


Click it and Unblock the Notifications











