Bigg Boss Telugu 4: లైఫ్ ఈజ్ బ్యూటీపుల్ హీరో అభిజిత్.. చార్మినార్ కట్టిన ఫ్యామిలీ
లాక్‌డౌన్ పరిస్థితులను ఎదిరిస్తూ భారీ హంగామా మధ్య ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి యువ నటుడు అభిజిత్ భాగమయ్యారు. ఆదివారం సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన రియాలిటీ షోలోకి అభిజిత్ ప్రవేశించారు. హోస్ట్ నాగార్జున ఆహ్వానం మేరకు ఇంట్లోని వేదికపైకి వచ్చిన అభిజిత్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంట్లో వినోదంతోపాటు నా టెలెంట్ ప్రదర్శిస్తానని అభిజిత్ అన్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో అభిజిత్ సినీ రంగ ప్రవేశం చేశారు. సాధారణ మధ్య తరగతి యువకుడిగా తన మార్క్ నటనను ప్రదర్శించి ఆకట్టుకొన్నారు. తొలిసినిమాలో అక్కినేని అమలతో కలిసి పనిచేసే అదృష్టాన్ని సొంతం చేసుకొన్న అభిజిత్ ఇప్పుడు నాగార్జున్ హోస్ట్‌గా వ్యవహరించే షోలో భాగం కావడం విశేషం.

అభిజిత్ వ్యక్తిగత జీవితానికి వస్తే మదనపల్లిలోని రిషి వ్యాలీ స్కూల్‌లో చదువుకొన్నారు. ఆ తర్వాత కొంపెల్లిలోని మల్లారెడ్డి కాలేజ్‌లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత మిర్చిలాంటి కుర్రోడు చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్‌తో ఆలరించాడు. ఆ తర్వాత రామ్ లీలా, పెళ్లిగోల వెబ్ సీరీస్‌లో నటించాడు.
తాతల కాలం నుంచి అభిజిత్ కుటుంబ కన్‌స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్నారు. తాతలు చార్మినార్ కట్టిన సమయంలో ఇంజినీర్లుగా, సిబ్బందిని సమకూర్చే బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికీ వారికి కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్నారు. ఈయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. బీజేపీ నేత జితేందర్ రెడ్డికి సమీప బంధువు.


Click it and Unblock the Notifications











