నా పొలంలోనూ లక్ష మొలకలొచ్చాయి రోయ్.. జై బాలయ్య.. దేవీ నాగవల్లి పోస్ట్ వైరల్
దేవి నాగావల్లి అనగానే ఒక న్యూస్ రీడర్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో ఆమె ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ ద్వారా దేవి అందుకుంటున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. ఆమె సోషల్ మీడియాలో రెగ్యులర్ పోస్ట్ చేస్తున్న ఫొటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల కొంచెం వినూత్నంగా ఒక పోస్ట్ చేశారు.

డ్యాన్స్ తో సరికొత్తగా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఈ సారి న్యూస్ ఛానెల్స్ కు చెందిన వారు ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చింది దేవి నాగావల్లి. హౌజ్ లో ఉన్నది కొన్ని రోజులే అయినా దేవి నాగవల్లి బాగానే హడావుడి చేసింది. డ్యాన్స్ తో కూడా ఆమె సరికొత్తగా మెప్పించడానికి ప్రయత్నం చేసింది.

ఆ విషయం జనాలకు అప్పుడే తెలిసింది
బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లలో టెలివిజన్ జనాలకు ఎక్కువగా తెలిసిన కంటెస్టెంట్ దేవి నగవల్లి మాత్రమే. ఆమె ఎన్నో ఏళ్లుగా మీడియా ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు. ఇక ఎంట్రీతోనే ఆమె తన కెరీర్ గురించి అనేక రకాల విషయాలను బయటపెట్టింది. ఆమె విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నట్లు జనాలకు అప్పుడే అర్ధమయ్యింది.

స్పెషల్ పోస్ట్ వైరల్..
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత దేవి నాగవల్లి గతంలో కంటే ఎక్కువగా తన క్రేజ్ ను పెంచుకుంది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా ఆమె చేసిన ఒక పోస్ట్ అయితే వైరల్ గా మారింది. నా పొలంలో మొలకలొచ్చాయ్.. జై బాలయ్య అంటూ క్యాప్షన్స్ కూడా ఇచ్చింది.

లక్ష మొలకలొచ్చాయి రోయ్..
దేవి నగవల్లి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఖాతాను లక్ష మంది ఫాలో కావడంతో స్టైలిష్ ఫొటోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా నా పొలంలోనూ లక్ష మొలకలొచ్చాయి రోయ్.. అంటూ నమస్కారం అని కామెంట్ చేసింది. అయితే ఆ ఫొటో వైరల్ అయ్యిందో లేదో విభిన్నమైన కామెంట్స్ కు దేవి సమాధానం కూడా ఇచ్చింది.

జై బాలయ్య అంటూ..
పాజిటివ్ గా స్పందించిన వారికి కృతజ్ఞతలు చెప్పిన ఆమె.. దీని వల్ల ఏమైనా ఉపయోగముందా అనే వారికి కూడా డిఫరెంట్ గా కౌంటర్ ఇచ్చింది. "ఉపయోగం ఉపయోగించడానికి ఉపయోగపడదు. కానీ అలవాటు పడాలంటే దాన్ని వాడటం ఉపయోగకరంగా ఉంటుంది.. జై బాలయ్య!" అంటూ.. తనకు తానే ఆ డైలాగ్ కు కాపీ రైట్స్ కూడా ఇచ్చింది. డైలాగ్ కొట్టిన ఎమోషన్ లో దేవి జై బాలయ్య అనే పదాన్ని సరదాగా వాడినట్లు అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











