బిగ్‌బాస్‌లో ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్‌బాబు హంగామా.. అదరగొట్టిన సెలబ్రిటీలు

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో ఏడో వారాంతం ఆటపాటలతో అదరగొట్టినట్టు తాజా ప్రోమోలు స్పష్టం చేస్తున్నాయి. బ్లాక్‌బస్టర్ టాస్క్‌కు కొనసాగింపుగా జరిగిన అవార్డు ఫంక్షన్లో సెలబ్రిటీలందరూ అందంగా ముస్తాబయ్యారు. టాలీవుడ్ లెజెండ్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబుకు నివాళిగా వారి పాటలకు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. 48వ రోజున జరిగిన ఈ కార్యక్రమం ఎలా సాగిందంటే..

ఆరేసుకోబోయి పారేసుకొన్నాను అంటూ

ఆరేసుకోబోయి పారేసుకొన్నాను అంటూ

బీబీ అవార్డుల కార్యక్రమంలో మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ నటించి అడవి రాముడు చిత్రంలోని ఆరేసుకోబోయే పారేసుకొన్నాను పాటకు సోహైల్, మోనాల్ కలిసి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత బంగారు బుల్లోడు చిత్రంలో బాలకృష్ణ, రవీనాటాండన్ స్టెప్పులు వేసిన స్వాతిలో ముత్యమంత పాటకు అవినాష్, అరియానా దుమ్మురేపే విధంగా డ్యాన్సు చేశారు.

అక్కినేని పాటకు అమ్మా రాజశేఖర్, దివి

అక్కినేని పాటకు అమ్మా రాజశేఖర్, దివి

ఆ తర్వాత దసరాబుల్లోడు చిత్రంలో చెంగాబి రంగు చీర కట్టుకొన్న చిన్నది పాటకు దివి, అమ్మా రాజశేఖర్ డ్యాన్స్ చేశారు. దివి హోయలు ఒలకపబోయగా.. అక్కినేని స్టైల్లో అమ్మా రాజశేఖర్ విజృంభించారు. వారిద్దరి స్టెప్పులు వేస్తున్నంత సేపు ఇంటి సభ్యులు చప్పట్లు, ఈలలతో హెరెత్తించారు.

శోభన్ బాబు పాటకు మెహబూబ్, లాస్య స్టెప్పులు

శోభన్ బాబు పాటకు మెహబూబ్, లాస్య స్టెప్పులు


ఇక చివర్లలో మెహబూబ్, యాంకర్ లాస్య మాస్ పాటకు దుమ్మురేపారు. దేవత చిత్రంలోని వెల్లువెచ్చే గోదారమ్మ పాటకు మెహబూబ్ దిల్‌సే, లాస్క అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. గోదావరి నది బ్యాక్ డ్రాప్‌ పెట్టుకొని వారిద్దరూ మాస్‌గా అలరించారు. వీరిద్దరి డ్యాన్స్‌కు ఇంటి సభ్యులు హంగమా చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
అమ్మా రాజశేఖర్ ఎమోషనల్‌గా

అమ్మా రాజశేఖర్ ఎమోషనల్‌గా

అవార్డుల కార్యక్రమంలో అమ్మా రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. ఇంటి సభ్యుల్లో ఉంటే ప్రతిభ, టాలెంట్‌ను బయటపెట్టిన ఏకైక షో బిగ్‌బాస్ మాత్రమే అని అనగానే సెలబ్రిటీలు ఆనందంలో మునిగిపోయారు. వీకెండ్ షో మాత్రం ఆద్యంతం ఆనందంగా సాగిపోయినట్టు కనిపిస్తున్నది. ఈ షో కోసం నాగార్జున అందుబాటులో లేకపోవడం వల్ల సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X